ఉపాధి పనులను నర్సరీను పరిశీలించిన జిల్లా అధికారులు
జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మరియు జిల్లా ముఖ్య కార్య నిర్వహణ అధికారి కామారెడ్డి జిల్లా చందర్ నాయక్ కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులను మరియు నర్సరీ పరిశీలించారు. ఫ్రైడే డ్రై డే కావున వాటర్ కింగ్ నిర్వహించడం కూడా జరిగింది.

కార్యాలయ సిబ్బంది మరియు ఉపాధి హామీ సిబ్బంది మరియు ఐకెపిఎం మరియు సీసీలతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ పథకాలను అందించేట్లు చూడాలన్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలను ఎక్కువగా పెంచి వారిని ఉదయం 10 గంటల లోపు వచ్చి వారి నిర్ణీత పనిని పూర్తి చేసుకొని వెళ్లేట్లు చూడాలన్నారు. కూలీలకు 300 రూపాయలు వచ్చే విధంగా చూడాలని మరియు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పని ప్రదేశాల్లో టెంటు, మరియు తాగునీటి వసతులు కల్పించాలన్నారు.

ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు మరియు మెడికల్ కిట్లు పని ప్రదేశంలో ఉంచవలనీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వేసవికాలం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రతి గ్రామంలో చలివేంద్రం మరియు నీటి వృధా కాకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ వృధా అక్కడ నిర్మూలిస్తూ మీరు పోకుండా నిర్మూలిస్తూ నీటిని రాధా చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి పూర్ణ చంద్రోదయ కుమార్ మరియు ఏపీఎం మరియు ఏపీవో,కార్యాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొనడం జరిగింది.
