Thursday, February 12, 2026

కాంగ్రెస్ యూత్ అధ్యక్షుల గ్రామాల అధ్యక్షుల అభిప్రాయాల సేకరణ

ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివానగర్ మండలంలోని గ్రామాల అధ్యక్షులతో, యూత్ అధ్యక్షులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్

ప్రతి ఒక్కరితో ముఖాముఖీగా రివ్యూ చేసిన ఎమ్మెల్యే ఇప్పటికి వరకు ఎన్ని ఓట్లను కాంగ్రెస్ వైపు వచ్చేలా చేసారు, వ్యక్తి గతంగా ఎన్ని ఓట్లు వేయిస్తామని మాట తీసుకున్నారు. ఇంటింటి ప్రచారం వంటి పై సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. మండల సమావేశాలలో చెప్పిన పనులను పూర్తి చేయని వారిని తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎవరు అయితే పార్టీ కి వ్యతిరేకంగా పని చేస్తారో వారిని పార్టీ నుండి బహిష్కరిస్తామని అన్నారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ తీసుకురావాలన్నారు. ప్రతి మండలంలో ఇలాగే రివ్యూ మీటింగ్ నిర్వహిస్తామని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త తొందరగా వారికి సూచించిన పనులను పూర్తి చేసి మెజారిటీ దిశగా ముందుకు సాగాలన్నారు.

ప్రతి ఒక్క కార్యకర్తల సుమారుగా తమ వ్యక్తి గతంగా 50 నుండి 60 ఓట్లు తమ బాధ్యతగా తీసుకొని ఇంటింటి ప్రచారం నిర్వహించాలని సూచించారు. కాంగ్రెస్ హామీలు, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే ద్వారానే ప్రతి పథకం అందేలా చేస్తామని విషయాన్ని ప్రతి ఓటరు కు తెలిసేలా చెప్పాలన్నారు. బీజేపీ వైఫల్యాలను, బీబీ పాటిల్ బిజినెస్ పాటిల్ అక్రమానలను ప్రజలకు చెప్పాలి. బీజేపీ టికెట్ అమ్ముకొని బీబీ పాటిల్ కు ఇచ్చిన విషయాన్నీ ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరారు.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular