నలుగురికి తీవ్ర గాయాలుఅతివేగంగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన డోర్నకల్ శివారు గ్యాస్ గోడౌన్ సమీపంలో జరిగింది .ఈ సంఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి డోర్నకల్ వైపు నుండి మహబూబాబాద్ వైపు వెళుతున్న ద్విచక్ర వాహనము ఉయ్యాలవాడవైపు నుంచి డోర్నకల్ వస్తున్నాయి ద్విచక్ర వాహనము ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో డోర్నకల్ మండలం వెన్నారం శివారు రాము కుంట తండాకు చెందిన తేజావత్ యశ్వంత్ 23 అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు వెన్నారం శివారు రామకుంట తండాకు చెందిన మంగీలాల్ ఖమ్మం జిల్లా కాశిరాజ గూడెం సమీపంలోని అరకోడు తండాకు చెందిన మోహన్ లకు తీవ్ర గాయాలు కాగా పార్వతి అనుశాలకు స్వల్ప గాయాలు అయ్యాయి విషయం తెలుసుకున్న డోర్నకల్ ఎస్సై తిరుపతి సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను వివరాలను సేకరించారు గాయపడ్డ క్షతగాత్రులను 108 ద్వారా ఎస్ఐ మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. అతివేగంగా ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
