Thursday, February 12, 2026

కార్యకర్తలకు అండగా ఉంటాం

హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సోషల్ మీడియా సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా డీసిసి అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, హుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి తో కలిసి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రచార రథాలను హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించారు.బిజెపి అబద్దాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. మనం నిజాలను నిర్భయంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలనీ వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కడియం కావ్య పిలుపునిచ్చారు.బిజెపి అభ్యర్థి చేసిన అరాచకాలు, అన్యాయాలను ఎండగట్టాలి.సోషల్ మీడియాలో ప్రతీ ఒక్కరూ సైనికులుగా పని చేయాలి.మోడీ ప్రభుత్వం దేశాన్ని కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడుతుంది.మోడీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేసి, రిజర్వేషన్లు ఎత్తివేసే ప్రమాదం ఉంది.దేశంలో అందరికి సమ న్యాయం జరగాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి.మీకు ఎప్పటికి అందుబాటులో ఉంటా.మీ కష్ట సుఖలలో పాలు పంచుకుంటాను.మీరు నాకు సపోర్ట్ చేయండి…. నేను మీకు అండగా ఉంటానని కడియం కావ్య హామీ ఇచ్చారు.ఇనుగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూసోషల్ మీడియా అకౌంట్లలో ఆక్టివ్ గా ఉండాలి.ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి.బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరన్ని తెలియజేయాలి.నెగెటివ్ పోస్ట్ లపై కౌంటర్ అటాక్ చేయాలి.మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది.కష్టపడి పని చేసిన ప్రతీ ఒక్కరికి గుర్తింపు ఉంటుంది.రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ నవీన్, రాష్ట్ర ఎస్సి సెల్ కో ఆర్డినేటర్ ఆనంద్ కుమార్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular