వర్నిలో కాంగ్రెస్ నాయకుల విలేకరుల సమావేశం 40 సంవత్సరాలుగా బాన్సువాడ నియోజకవర్గం లో పెత్తనం జలాయిస్తూ ప్రభుత్వ సొమ్మును ఇష్టారాజ్యంగా వాడుకొని ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసి తీర అధికారం చేజారేటప్పుడు మోసలు కన్నీరు కార్చడం మానుకోవాలని దమ్ము ధైర్యం ఉంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తాను దేనికైనా సిద్ధమని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సవాల్ విసిరారు. మీ ప్రభుత్వం మీరు పేదలకు ఇల్లు కట్టిన బాధ్యత మీపై ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ల పేరిట ఇళ్లను అగ్రిమెంట్లు చేసి ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులను దగా చేశారని అన్నారు. ఇల్లు నేర్పించుకునే వారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని తీరా ఇల్లు నిర్మించుకున్న వారికి కుంటి సాకులు చెబుతూ రెండు నుండి నాలుగు లక్షల రూపాయలు మాత్రమే పేదలబ్ధిదారులకు అందించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణదారులను అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత నీకే దక్కుతుందని ఏనుగు హెచ్చరించారు. పేదల బిల్లులు చెల్లింపులో తాను ఏనాడు అడ్డుకోలేదని నేను ఇప్పటికే కొంతమందికి బిల్లులు ఇప్పించామని అన్నారు. నాపై చేస్తున్న ఆరోపణలను మీరు రుజువు చేయదలుచుకుంటే నేను ఏ దేవాలయానికైనా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని నాపై మీరు చేస్తున్నారు మీరు నాకు పిలిపిస్తే నేను వచ్చి మీకు సమాధానాన్ని చెబుతానని హెచ్చరించారు.బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో బాన్సువాడ నియోజకవర్గం ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్ రెడ్డి డబల్ బెడ్ రూమ్ ఇండ్ల బిల్లులను ప్రభుత్వం చెల్లించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగానికి కూడా సిద్ధమని చెప్పడాన్ని ఖండించారు. ఈ వయసులో ఇలాంటి అబద్ధాలు మాట్లాడటం సమంజసం కాదని గత ప్రభుత్వంలో మీ అనుచరులు ఆ బిల్లులని కాంట్రాక్టర్ల ద్వారా విడుదల చేయించుకొని గత ఎన్నికల్లో పేదల సొమ్ము వాడుకున్నారు. మీకు నిజాయితీ ఉంటే బిల్లులను లబ్ధిదారులకు మీ అనుచరులైన కాంట్రాక్టర్ల దగ్గర నుండి ఇప్పించాలని లేనిపక్షంలో నాపై చేసిన ఆరోపణలను విరమించుకొని లబ్ధిదారులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు ఇలాంటి మొసలి కన్నీళ్లు ఎన్ని కార్చిన నియోజకవర్గం ప్రజలు ఇక మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదని హెచ్చరించారు. అబద్ధాలు ఆడకుండా బిల్లులని ఇప్పించి లబ్ధిదారులకు మేలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు ఎలమంచిలి శ్రీనివాసరావు ఎంపీపీ లక్ష్మీ మేక వీర్రాజు, మాజీ ఎంపీపీ బద్యా నాయక్, టౌన్ అధ్యక్షులు మొయిన్ డిసిసి డెలికేట్ రాజారెడ్డి, గంగా ప్రసాద్, అడ్వకేట్ బానోత్ రమేష్, సొసైటీ డైరెక్టర్ గంగప్ప, రెడ్డి రాంబాబు,కోనేరు సురేష్ కంది శ్యామ్, మాజీ ఎంపీటీసీ హరి మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
