గాంధారిలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన కాంగ్రెస్ నాయకులు
జహీరాబాద్ పార్లమెంటు ప్రజలు రెండు పర్యాయాలు బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ కు అవకాశం ఇచ్చారని వారు ఏనాడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడలేదని ఆయన వ్యాపారాలకి పరిమితమై బిజినెస్ పటేల్ గా పేరు సంపాదించారని, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆరోపించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు.

గాంధారి మండల కేంద్రంలో భారీ ర్యాలీతో గాంధారి వీధుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రజలకు వివరించారు. ఈ సందర్బంగా సురేష్ శెట్కార్ మాట్లాడుతూ బీజేపీ ఎంపీ గా పోటీ చేసే అభ్యర్థి బీబీ పాటిల్ కాదు బిజినెస్ పాటిల్, బిజినెస్ లకు తప్ప రాజకీయాలకు ఏ మాత్రం పనికి రాడు పదేళ్లపాటు నిర్లక్ష్యం చేసి నేడు మళ్ళీ పార్టీ ఫిరాయించి దేవుని పేరుతో ఓట్లు పొంది పదం కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారని జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కార్ మండిపడ్డారు.గాంధారి మండలాన్ని దత్తత తీసుకుంటానని మోసం చేసి అభివృద్ధి ఏం లేకుండా మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తున్నాడు, కార్ టైర్ పంక్చర్ అయిందని పువ్వు పై కూర్చున్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీ ని గెలిపిస్తే ఎమ్మెల్యే, ఎంపీ కలిసి జోడేద్ధుల్లా పని చేసి నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో ఉంచుతామన్నారు. శెట్కార్ ఎంపీ గా ఉన్నప్పుడు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఎన్నో బ్రిడ్జి లు, రోడ్లు వేశామని తెలిపారు. బీబీ పాటిల్ ని గెలిపిస్తే బొంబాయి లో తప్ప తెలంగాణ కి రాడు, ఇందిరమ్మ రాజ్యం తీసుకరావాలంటే కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి గెలిపించాలనీ పిలుపునిచ్చారు.

