Thursday, February 12, 2026

కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచుకున్నారు

భువనగిరి రోడ్ షో లో సీఎం రేవంత్ రెడ్డి

కుటుంబ పాలనతో కెసిఆర్ రాష్ట్ర సంపదను దోచుకున్నారని, శాసనసభ ఎన్నికల్లో ప్రజలు గులాబీ పార్టీకి బుద్ధి చెప్పారని, అధికారం కోల్పోయిన కేసీఆర్ మతిభ్రమించి వ్యాఖ్యలు చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే సహించేది లేదని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా తెలంగాణలో చాటుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నల్గొండ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రోడ్ షో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ పార్లమెంటు సభ్యులుగా అనిల్ భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.నల్గొండ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ.
హైదరాబాద్ సంస్థానంగా మొదలైన పోరాటం విముక్తి పొందింది.దొరల గడీల నుండి బంధ విముక్తి చేసింది ఈ ప్రాంతం.బీజేపీ, బిఆరెస్ నేతలు గెలిస్తే ఎం చేస్తారో ఆలోచంచండి.పార్లమెంట్ ను స్తంబింబచేసి తెలంగాణ తెచ్చిండ్రు ఇక్కడి నాయకులు.
సొంత ఆస్తులు కరగబెట్టి సేవ చేసిండ్రు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.అడవి పంది లాగా మెక్కి టీఆరెఎస్ వాళ్లు బలిసిండ్రు.
మంత్రి పదవిని త్యాగం చేసి, నల్గొండ గడ్డపై ఆమరణ నిరాహార దీక్ష చేసిన వ్యక్తి కోమటిరెడ్డి.భూమికి మూరేడు లేని వానికి చెప్తున్నా.. కోమటిరెడ్డి బ్రదర్స్ మందు లో సోడా కలిపి రాలేదు.నాతో పాటు ముఖ్యమంత్రి అర్హత కలిగిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని ముఖ్యమంత్రి అన్నారు.నా ముఖ్యమంత్రి పదవి అర్హత కాదు బాధ్యత
స్థానిక నాయకులు ఎవరైనా అందరు ఎప్పుడైనా నన్ను కలవచ్చు.గడీల గోడలు బద్దలు కొట్టి జ్యోతిరావ్ పూలె పేరు పెట్టినం.వామ పక్ష నేతల మద్దతు కు, గౌరవానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది.కేంద్ర సంస్థల ను దుర్వినియోగం చేశారు.
ఇండియా కూటమి గెలుపు తో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు.బిఆరెస్ ఏమైనా సీట్లు గెలిస్తే బీజేపీ కి మద్దతు ఇస్తుంది, నల్గొండ ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో ఆలోచన చేసి ఓటు వేయాలని కోరారు.
నిరుద్యోగుల ఆశలకు గండి గొడితే ప్రజా పాలన లో మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం.
ఆడబిడ్డలకు మాటిచ్చాము.. ఆర్టీసీ లో ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినం.
రాజీవ్ ఆరోగ్య శ్రీని పది లక్షలకు పెంచినం.. అందుకు కాంగ్రెస్ ను ఓడగొట్టాలనా..
గ్యాస్ సబ్సిడీ ఇచ్చి ఐదు వందలకు సిలెండరు ఇచ్చి నందుకు కాంగ్రెస్ ను ఓడగొట్టాల..ఉచిత కరెంటు బిల్లు ఇచ్చినందుకు ఓడగొడుతారా.కెసిఆర్ లాగులో తొండలు వేసి కోమటిరెడ్డి బ్రదర్స్ తో కొట్టిస్తా అని ముఖ్యమంత్రి హెచ్చరించారు.బీజేపీ నాయకులను అడుగుతున్న..కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది.రాష్ట్ర అవతరణ కు అడ్డు పడిన బీజేపీ కి ఓట్లు అడిగే హక్కు లేదు.భువనగిరిలో బిఆరెస్ బీజేపీ కి మద్దతు ఇస్తుంది.
బీర్ల ఐలయ్య కు విప్ ఇచ్చినం, అనిల్ కు రాజ్య సభ ఇచ్చినం.
బలహీన వర్గాలకు సామజిక న్యాయం చేసినం.అటువైపు జానా, ఉత్తమ్.. ఇటు వైపు కోమటిరెడ్డి బ్రదర్స్ మనకు మనమే పోటీ..కిరణ్ గెలిస్తే త్రిబుల్ ఇంజిన్ లు భువనగిరి కి పనిచేస్తాయి.యాదాద్రి పేరు యాదగిరి గుట్ట గా మారుస్థాం.
కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ కు డబుల్ ఇంజిన్ లు.. గందమళ్ళ, బ్రాహ్మణ వెళ్లెంల, ఎస్ ఎల్ బి సి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ఆగస్టు 15 లోపు యాదగిరి లక్ష్మీనర్సింహా స్వామి సాక్షిగా రెండు లక్షల రుణ మాపి చేస్తా..
వచ్చే పంటకు 500 బోనస్ ఇచ్చి ధాన్యం కొంటాం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular