ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి
ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేసింది. సోమవారం ఆల్ ఇండియా కాంగ్రెస్ సెంట్రల్ కమిటీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా పొంగులేటి ప్రసాద్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి ప్రధాన నాయకుల కుటుంబాల సభ్యులు రంగంలో దింపేందుకు ఎవరికి వారు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. నామినేషన్ల గడువు ముంచుకు రావడంతో ఎట్టకేలకు కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం నిర్ణయం తీసుకుని టికెట్ కేటాయింపు కు తెర దింపింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా తన కుటుంబ సభ్యులకు ఇప్పించుకొని పై చేయిగా నిలిచారు. మంత్రి పొంగులేటి స్వయాన తన సహోదరుడికి టికెట్ ఇప్పించుకోగలిగారు. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి టికెట్ కేటాయింపులో కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందనే చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామంగా ఖమ్మం కాంగ్రెస్ పార్టీ తమ్ములు భావిస్తున్నారు.
