పోతంగల్ లో కాంగ్రెస్ నాయకుల సమావేశం.
బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పట్ల ప్రతినిత్యం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి డబ్బా కొట్టుకుంటూ ఇంకెన్నాళ్లు పంపడం కడుక్కుంటారని, డబుల్ బెడ్ రూమ్ నిర్మించుకున్న వారికి నేటి వరకు బిల్లులు చెల్లించడంలో చేతివాటం ప్రదర్శించింది పోచారం కుటుంబ సభ్యులకు కాదా అని పోతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించి పార్లమెంటు ఎన్నికల్లో ఎన్నో కొన్ని ఓట్లు సంపాదించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటినుండి ఈ ఆటలు బాన్స్వాడ నియోజకవర్గంలో సాగవని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల బిళ్ళలు పోచారం తనయుల జేబులోకి వెళ్లాయని, వారి జేబులోని డబ్బులు ముందుగా పేద లబ్ధిదారులకు అందజేసి తమ నిజాయితీని చాటుకోవాలని కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల శంకర్ పోచారానికి సవాలు విసిరారు.
నియోజకవర్గం పోతంగల్ మండల కేంద్రంలో శనివారం రాత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా పొతంగల్ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ బిల్లులు ఇయ్యకుంటే అమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పడం జరిగింది. ఆదివారం మండల కేంద్రంలో సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేశారు. దమ్ముంటే ఇప్పటివరకు మంజూరైన బిల్లులో పేద ప్రజలకు ఇవ్వకుండా వాళ్ల కుమారులైన పోచారం సురేందర్ రెడ్డి ,పోచారం భాస్కర్ రెడ్డి మరియు వాళ్ళ ముఖ్య అనుచరుల పేర్లమీద టెండర్ వేసి బిల్లులు పంచకుండా లబ్ధిదారులకు ఇవ్వకుండా వాళ్ల సొంత జేబులో నింపుకున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి మీరేమో ఒక్కొక్క బిల్లు ఆగిందని అంటున్నారు. కానీ పేద ప్రజలందరి దగ్గరికి వెళ్తే అందరూ రెండు మూడు బిల్లులు రావాలని అంటున్నారు. ఇందులో ఏది నిజం ఏది అబద్దం మీరు ఒకవేళ ప్రతి ఊరికి వచ్చి ఇప్పటివరకు మంజూరైన బిల్లులు పేద ప్రజలకు ఎన్ని ఇచ్చారు కాంట్రాక్టు దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఆ విషయాలు నిరూపించుకోవాలని హెచ్చరించారు. మీరు చర్చకు సిద్ధమా,,? మరియు మా మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పైన అబద్ధాలు చెప్పడం మానుకోవాలని పేద ప్రజలకు బిల్లులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉందని ఎన్నికల తర్వాత ప్రతి ఒక్కరికి బిల్లులు ఇప్పిస్తానని పలు సమావేశంలో చెప్పడం మా నాయకుని పైన ఇంకొకసారి అబద్ధాలు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ఈ సమావేశంలో పోతంగల్ గ్రామ కమిటీ అధ్యక్షుడు పుల్కంటి సాయిలు. యశ్వంత్, సుంకిని హనుమంతు, శ్రీకాంత్ ,దత్తు, మహమూద్ భాయ్, కలేద్, వీరుగొండ తదితరులు పాల్గొన్నారు.
