Thursday, February 12, 2026

మతాల పేరిట దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం

నిజాంబాద్ రైతు సమస్యలు పరిష్కరించే బాధ్యత నాదే ముఖ్య మంత్రి రేవంత్ వెల్లడి

ధాన్యానికి 500 బోనస్ చెల్లించి రైతులను ఆదుకుంటాం

పసుపు బోర్డు రైతు నాయకుడు జీవన్ రెడ్డి కే సాధ్యం

పంట రుణమాఫీ పై బాసర సరస్వతి పై ఒట్టు పెట్టుకుని హామీ ఇచ్చిన సీఎం

కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం

జీవన్ రెడ్డిని కేంద్ర మంత్రి చేస్తా నాదే బాధ్యత సీఎం వెల్లడి

ఓటమి కూడా గెలుపుకు నాంది మల్కాజ్ గిరి నిదర్శనం

నిజాంబాద్ రైతుల ఆశీస్సులతో పిసిసి తర్వాత ముఖ్యమంత్రి అయ్యా

తెలంగాణలోనే నిజాంబాద్ రైతాంగం ఆదర్శప్రాయులు

హర్యానా, పంజాబ్ రైతులు ఉద్యమించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచారు

పదేళ్లు నిజాంబాద్ ప్రజలు బిజెపి టిఆర్ఎస్ అభ్యర్థులకు ఎంపీగా పట్టం కట్టారు. వారి నిర్లక్ష్యం జిల్లా రైతాంగానికి శాపం

మచ్చలేని జీవన్ అన్నను గెలిపించండి అన్ని నేను చూసుకుంటా

నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించి తీరుతాం

వంద రోజుల్లో చక్కర కర్మాగారాలను తెరిపిస్తామని మూతవేశారు

ఐదు రోజుల్లో పసుపు బోర్డు బాండ్ కే పరిమితం

దేశంలో కొన్ని మతతత్వ పార్టీలు మతాలను రెచ్చగొట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఇటువంటి పరిణామాలు దేశానికి మంచిది కాదని ప్రజలు గమనించి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ జన జాతర సమావేశంలో ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి హాజరయ్యారు. నిజాంబాద్ రైతంగం తనకు ఆనాటి నుండి నేటి వరకు ఉత్సాహాన్ని నింపుతుందని అన్నారు. నిజాంబాద్ రైతాంగ సమస్యల పరిష్కారం చేసి తీరుతానని పదేళ్లపాటు తెలంగాణ రైతాంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్రాల రైతులు రైతు సమస్యల పరిష్కారానికి ఉద్యమించి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి నల్ల చట్టాలను వెనుకకు తీసుకునేట్లు చేశారన్నారు. తెలంగాణలో నిజాంబాద్ ప్రాంత రైతులు ఉత్సాహం మరియు ఆదర్శప్రాయాలని కొనియాడారు. నిజాంబాద్ రైతుల సమస్యలు విస్మరించిన వారిని శాశ్వతంగా రాజకీయాలకు దూరం చేయడంలో దిట్ట అని అన్నారు. రాబోయే రోజుల్లో రైతులు ఎంత మేరకు వరి పంటను సాగు చేసిన 500 రూపాయలు క్వింటాలకు బోనస్ అందజేసి దాన్యం కొనుగోలు చేస్తామన్నారు. పసుపు బోర్డు పేరిట బిజెపి పార్లమెంట్ అభ్యర్థి ఐదేళ్లపాటు రైతులను మోసం చేసి మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని ప్రధానమంత్రి తో హామీ ఇప్పించి జీవో విడుదల చేశారు. ఏ ప్రాంతంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నారు జీవోలో పేర్కొనకపోవడం విచారకరమన్నారు. మరోసారి బిజెపి అభ్యర్థి అరవింద్ రైతులను మాయ చేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. పసుపు బోర్డు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తీరుతుందని రైతులకు హామీ ఇచ్చారు. స్వయానా రైతు అయినటువంటి జీవన్ రెడ్డిని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిపామని జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతు నాయకుడిని పార్లమెంటు పంపిస్తే పార్లమెంటులో రైతు కూలీల సమస్యలపై గళం విప్పి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.

బాసర సరస్వతి మాత పై ఒట్టేసి రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన సీఎం

శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చామని, రుణమాఫీ హామీని చేసి తీరుతామని బాసర సరస్వతి మాత పై ఒట్టేసిచెబుతున్నానని ఆగస్టు 15 లోపు 2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేసి తీరుతానని ముఖ్యమంత్రి గంటాపదంగా చెప్పారు. రైతుల కష్టాలను తెలిసిన నాయకులమని రైతుల, కూలీల సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే రుణమాఫీ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చేసి తీరుతుంది అన్నారు. తనను రైతులు వెన్ను తట్టితేనే నేను ఈ స్థాయిలో ఉన్నాను నేడు నేను రైతుల సమస్యలను మరవను అన్నారు.

నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తాం

నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత పాలకులు కేసీఆర్ కుటుంబ సభ్యులు అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఫ్యాక్టరీలను తెరిపిస్తామని నడిచే ఫ్యాక్టరీలకు తాళం వేసిన ఘనత కేసిఆర్ కుటుంబానికి దక్కిందన్నారు. చక్కెర కర్మాగారాలను తెరిపించేందుకు ఇప్పటికే సభాసంఘాలను ఏర్పాటు చేశామని. మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో అధ్యయనం చేశారని అట్టి నివేదికలను సైతం ప్రభుత్వానికి అందించారని తెలిపారు. రాబోయే ఏడాదికి బోధన్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించి తీరుతామన్నారు. గతంలో ఆసియా ఖండంలోనే రెండో స్థానంలో ఉన్న చక్కెర పరిశ్రమను మూత వేసిన రాజకీయ పార్టీలను ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికే బోంద పెట్టారని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

మత రాజకీయాలు ఎన్నో రాజులు సాగవు

భారతీయ జనతా పార్టీ మత రాజకీయాలను రెచ్చగొడుతూ దేశంలో విచ్ఛిన్నకర పరిస్థితులను ఎదురయ్యే విధంగా చూస్తున్నారని, సెక్యులర్ దేశంలో ఎవరి ఆటలు సాగవని ముఖ్యమంత్రి హెచ్చరించారు. హిందువుల ఆస్తులు ముస్లింలకు కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీని ఓడించాలని మోడీ ప్రకటన చేయడం పై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని అభివృద్ధి చేసి ఓటర్లను ఆకట్టుకొని అధికారంలోకి వస్తే తాము స్వాగతిస్తామని, అలా కాకుండా రాముడు పేరుతో రాజకీయాలు చేయడం దేశానికే ప్రమాదం అన్నారు. పదేళ్లపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రైతులకు ఏమి ఓ రగబెట్టలేదన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు దేశంలో ఉన్నాయని ఎవరి ఆస్తులు ఎవరు ధారా దత్తం చేసి అధికారం లేదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రధాన చేయడం మంచిది కాదని ఇలా చేస్తే దేశం కుప్పకూలుతుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తదని, నిజాంబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదిస్తే పార్లమెంట్లో ప్రజా సమస్యల గళం విప్పుతారని అన్నారు. దేవుడు గుడిలో, భక్తి గుండెల్లో ఉండాలని ముఖ్యమంత్రి చమత్కరించారు. తమకు రాముడు దేవుడేనని హిందువుగా గర్విస్తానని, ఇతర మతాలను గౌరవిస్తామన్నారు.

ఓటమి గెలుపుకు నాంది పలుకుతుంది.

ఓటమి కూడా గెలుపుకు నాంది పలుకుతుందని తన రాజకీయ జీవితంలో జరిగిన అనుభవాలే నిదర్శనమని ముఖ్యమంత్రి అన్నారు. 2018 శాసనసభ ఎన్నికల్లో అను ఓడిపోకపోతే ఓ మడుగులో ఉండే వాడినని, కాంగ్రెస్ పార్టీ తన ఆదరించి మల్కాజిగిరి నుండి ఎంపీగా బరిలోకి దింపి గెలిపించిందన్నారు. ఆ గెలుపుతో తాను తెలంగాణ సమస్యలను పార్లమెంట్లో లేవనిత్యానని, కేంద్ర అధిష్టానాన్ని ఆకర్షించగలిగాను అన్నారు. ఓటమితోనే తాను ఎంపీగా గెలిచి అనంతకాలంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యానని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సమస్యలపై ఉద్యమించాను. రాష్ట్రాన్ని పాలించిన పాలకులు స్వప్రయోజనాలకు రాష్ట్రాన్ని నాశనం చేసి అప్పుల ఊబిలోకి నెట్టారు అన్న విషయాన్ని ప్రజల ముంగిట పెట్టామన్నారు. తెలంగాణ ప్రజలు తనపై నమ్మకం నుంచి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఎమ్మెల్యేలు గెలిపించడంతో నేను ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాను అన్నారు. అర్ధరాత్రి వందలాది మంది పోలీసులను తన ఇంటికి పంపించి పాలకులు తనను హింసకు గురిచేసి, వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సి వచ్చింది అన్నారు.

నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటు పంపించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. మచ్చలేని నాయకుడు, స్వయానా వ్యవసాయం చేసుకునే జీవన్ అన్నను గెలిపిస్తే అన్ని తానై ఈ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మచ్చలేని నాయకుడైనప్పటికీ శాసనసభ ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఓటమి కూడా మంచి జరిగే రోజులు త్వరలో రానున్నాయని జోస్యం చెప్పారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం ఖాయమని, జీవన్ రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా వస్తారని అన్నారు, వ్యవసాయ శాఖ మంత్రిని చేసే బాధ్యత తనదేనని, జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత కూడా తానే తీసుకుంటానని ప్రజలకు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నాయకులు సునీల్ రెడ్డి, వినయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, గడుగు గంగాధర్, నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, బోధన్ మున్సిపల్ చైర్మన్ పద్మ శరత్ రెడ్డి, నాగేశ్వరరావు, చిన్న, గంగ శంకర్, ఆదినారాయణ, పాషా మోహినిద్దీన్, పలువురు నిజాంబాద్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రైతే ఢిల్లీ నాయకుడైతే

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular