Thursday, February 12, 2026

బాన్సువాడలో గులాబీ దళంహస్తం గూటికి

40 ఏళ్ల పాటు బాన్సువాడ నియోజకవర్గంలో ఆధిపత్యాన్ని కొనసాగించిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి రోజురోజుకి గండి పడుతుంది.
శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారాన్ని కోల్పోవడం గులాబీ తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. పదేళ్లపాటు అధికారాన్ని అనుభవించి పదవులు డబ్బు సంపాదించిన నాయకులు సైతం పోచారాన్ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో 20 వేల పైచిలుకు మెజార్టీని సాధించిన గులాబీ పార్టీ రాబోయే పార్లమెంటల్ ఎన్నికల్లో పరాభవాన్ని చూడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏనుగు రవీందర్ రెడ్డి పోటీ చేసి బాన్సువాడలో ఓటమి పాలయ్యారు. ఆనాడు బాన్సువాడ కాంగ్రెస్లో ఐక్యత లేకపోవడంతో దిక్కులేని పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం ఏనుగును బాన్సువాడ బరిలో దింపింది. టికెట్ కేటాయింపులను ఎన్నో రోజులు కాలం వృధా అయ్యింది. 15 రోజుల్లో ఎన్నికలు జరిగే ముందు ఏనుగు రవీందర్ రెడ్డి కి బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు. అయినప్పటికీ ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఐక్యం చేసి బలంగానే ఓట్లను సంపాదించారు. ఓటమిపాలైనప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం యువ నాయకుడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడంతో ఓటమిపాలైన అభ్యర్థులను ఆయన నియోజకవర్గాల్లో ఇన్చార్జిలుగా నియమించడం ఓటమి పాలైన నాయకులకు ఊరటను ఇచ్చింది. తనకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతినిత్యం బాన్సువాడ నియోజకవర్గంలోని కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏ ఆపద వచ్చిన నేనున్నానంటూ ధైర్యాన్ని నింపుతున్నారు. ప్రజా ప్రతినిధి కాకపోయినప్పటికీ తమ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ప్రభుత్వపరంగా ప్రజలకు చేయాల్సిన పనులను వేగవంతంగా చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గంలో ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది ప్రజాప్రతినిధులు గులాబీ తమ్ముళ్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరికలను పోచారం కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. పార్టీని వీడిన వారికి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తామని, ఇబ్బందులకు గురిచేస్తామని పోచారం నేటికి హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఆయనప్పటికీ పార్టీలో చేరిన వారికి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి ఏనుగు రవీందర్ రెడ్డి మనోధైర్యాన్ని నింపుతూ ఉన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు సేవలు అందించడం ఒక ఎత్తు సమస్యలను ఇన్చార్జి వద్దకు తీసుకువెళ్లడంలో నాయకులు ఎవరికి వారు పోటీపడి సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. వారు చేసిన పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయటం, నాయకులకు కార్యకర్తలకు సమాచారం ఇవ్వడంలో బాన్సువాడ నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ బోయిడి లక్ష్మణ్ కృషి చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలోకి పలువురి చేరిక

పోచారం తనయుల వ్యవహార శైలి నచ్చక బాన్సువాడ ఉపకార్యదర్శి టిఆర్ఎస్ పార్టీ యూత్ పట్టణ అధ్యక్షుడు యూనిస్ ఆధ్వర్యంలో దాదాపుగా 75 మంది టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మరియు మాజీ శాసనసభ్యులు బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular