Monday, June 29, 2026

శోభయాత్ర లో పాల్గొన్న బాజిరెడ్డి బిగాల

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గోల్ హనుమాన్ మరియు రొకడి హనుమాన్ ఆలయాల్లో మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల మరియు ఎంపీ అభ్యర్థి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శోభయాత్ర లో ఆయన ఆధ్వర్యంలో జెడ్పి కార్యాలయం వద్ద మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు,పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు హనుమాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. జిల్లా ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చిన నేను అండగా ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేయర్ నీతూ కిరణ్ ,సిర్ప రాజు,ప్రభాకర్ రెడ్డి ,సుజిత్ సింగ్, సత్యప్రకాశ్,దండు శేఖర్ మరియు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular