Thursday, February 12, 2026

వర్ధన్న పేట కాంగ్రెస్ లో భారీ చేరికలు.

వర్థన్నపేట నియోజకవర్గంలో పుంజుకుంటున్న కాంగ్రెస్ బలం

నాయకుడే ఒక సేవకుడి లాగా పని చేస్తున్న తరుణంలో ప్రజలందరూ ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై నేడు కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్, బిజెపి పార్టీ నాయకులు చేరారు. హనుమకొండ జిల్లా
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 43వ డివిజన్ హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు 43వ డివిజన్ కార్పొరేటర్ ఈదుర్ల అరుణ విక్టర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి సుమారు 150 మందికి కాంగ్రెస్ పార్టీలో వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పాత కొత్త అనే విభేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని *వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 43వ డివిజన్ అధ్యక్షుడు చింత ప్రకాష్, డివిజన్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular