Thursday, February 12, 2026

హనుమాన్ భక్తివిశ్వ మానవాళికి ఆదర్శం

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి

విశ్వాసానికి ప్రతీక ఆంజనేయ స్వామి

హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నిజామాబాద్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.హనుమాన్ శోభా యాత్ర లో పాల్గొన్నరు.
హనుమాన్ జయంతినీ పురస్కరించుకొని నిజామాబాద్ పట్టణంలోని పలు హనుమాన్ ఆలయాల్లో నిజామాబాద్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
దాసాంజనేయా స్వామీ, నీలకంటేశ్వర స్వామీ, ప్రసన్నంజనేయ స్వామీ, మార్కండేయ ఆలయం, గోల్ హనుమాన్ ఆలయంతో పాటు పలు ఆలయాల్లో ఆంజనేయ స్వామినీ దర్శించుకొని, పూజలు చేశారు.
అన్నదానంలో పాల్గొని భక్తులకు వడ్డించారు.
అనంతరం హనుమాన్ శోభా యాత్రను పురస్కరించుకొని
స్వామివారి విగ్రహం ఎదుట ప్రత్యేక పూజలు చేసిశోభా యాత్ర లో పాల్గొన్నారు.
లోకానికి ఆదర్శ మూర్తి శ్రీరామ చంద్రుడు,శ్రీరాముడి భక్తుడు ఆంజనేయ స్వామి జయంతి హిందువుల ఇంట సుఖసంతోషాలు నింపాలని , హనుమాన్ జయంతి శుభ కాంక్షలు తెలిపారు.హనుమాన్ పూజలతో ఆత్మ విశ్వాసం పెంపొందుతుంది.విశ్వాసానికి, భక్తికి ఆంజనేయ స్వామి ప్రతీక అని అన్నారు.హనుమాన్ భక్తి, అంకిత భావం విశ్వమానవాళికి ఆదర్శమని జీవన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, పట్టణ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular