ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో లాలూచి పడి నీటి వాటాల్లో తెలంగాణకు కెసిఆర్ అన్యాయం చేశారని నల్గొండలో సాగునీటి ఇబ్బందుల్లో నెట్టేసి నాశనం చేశారని మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి కోమటిరెడ్డి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
రేపు ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ వేస్తున్నారు.
నామినేషన్ కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు, lమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాలి..కాంగ్రెస్ పార్టీ 13,14 పార్లమెంట్ సీట్లు గెలవబోతున్నాం.కేసీఆర్ నల్గొండ జిల్లాలను నాశనం చేశారు.. నీవల్లే జిల్లాకి కరువు వచ్చింది.నీటి జలాలు పంపకంలో జగన్ తో,కేసీఆర్ లాలూచీ పడ్డారు.కేసీఆర్ మిర్యాలగూడకి ఏ ముఖం పెట్టుకొని వస్తారు.బస్ యాత్ర చేయడానికి కేసీఆర్ కి సిగ్గు ఉండాలి.కేసీఆర్ ది ఇక ముగిసిన శకం.మతాల మధ్య చిచ్చుపెట్టి భాజపా రాజకీయాలు చేస్తోంది.
ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది..రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారు.
పదేళ్ళలో ఏమి చేయని కేసీఆర్..బస్ యాత్ర ద్వారా ఏమి చేస్తారు.తెలంగాణ భారాస ఒక్క సీట్ కూడా గెలవదు.కేసీఆర్ మెదక్ స్థానం ఒక్కటి గెలిపించుకో చూద్దాం.
నేను పిలిస్తే పార్టీలోకి రావడానికి 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు.
నల్గొండ,భువనగిరిలోని భారాస అభ్యర్థులు సర్పంచులుగా కూడా పనికిరారు. భారాస నేతల గురుంచి,జగదీష్ రెడ్డి గురించి గుత్తా సుఖేందర్ రెడ్డి బాగా చెప్పాడు.సుఖేందర్ రెడ్డికి ధన్యవాదాలు చెబుతున్నాం.
బస్ యాత్ర కాదు కదా మోకాళ్ళు యాత్ర చేసిన..నల్గొండ,భువనగిరిలో డిపాజిట్లు కూడా రావు.
నల్గొండ జిల్లాను కెసిఆర్ నాశనం చేశారు.
RELATED ARTICLES
