బలరాం నాయక్ ను భారీ మెజారిటీతో గెల్పించాలనీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు.
భద్రాచలం నియోజకవర్గ దుమ్ముగూడెం మండలంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు మరియు మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు పొద్దెం వీరయ్య ,భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ,మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ,దుర్గ ప్రసాద్,చింతిరియాల రవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.


