Thursday, February 12, 2026

రైతులకు మేలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్

గతంలో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసినా చరిత్ర

పదేళ్లలో మూడింతలు మద్దతు ధర పెంచింది కాంగ్రెస్ పార్టీ

అదానీ అంబానీ లకు మేలు చేసేది బీజేపీ పార్టీ

ఎన్నికలు రైతులకు కార్పొరేట్ కంపెనీలకు మధ్య

కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి

గతంలో యూపీఏ హయంలో పదేళ్లలో రైతులకు వరి ధాన్యం పై మూడింతలు మద్దతు ధర పెంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఏక కాలంలో రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేశామని రైతుల కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రైతులు అన్ని గమనిస్తున్నారని కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం పివిఆర్ భవన్ లో నియోజక వర్గ ఇంచార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి అరవింద్ రైతులను మోసం చేస్తూ కల్లబొల్లి మాటలు చెప్తూ ఎన్నికల ముందు మోడీ తో పసుపు బోర్డ్ ఏర్పాటు చేస్తామని చెప్పించడని ఇదే అరవింద్ గెలిచినా ఐదేండ్లలో స్పైసెస్ బోర్డ్ గొప్ప అనీ చెప్పాడని గుర్తుచేశాడు, దేశంలో 60కి పైగా చక్కెర ఫ్యాక్టరీ లు తెరిపిస్తాం అని చెప్తున్న అరవింద్ పార్లమెంటు నియోజవర్గo లో ఎందుకు తెరిపించలేదు అని ప్రశ్నించారు. యూరియా రేటు 50 రూపాయలు పెంచి బస్తాలో ఐదు కిలోల యూరియా తగ్గించి రైతులకు మోసం చేస్తున్నారనీ, బీజేపీ అదానీ అంబానీ ల కార్పొరేట్ కంపెనీలకు మేలు చేస్తుంది తప్ప రైతుల బాధ బీజేపీ నాయకులకు తెలియదని అన్నారు. కవిత అడుగు జాడల్లో అరవింద్ నడుస్తున్నడ ని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భారీ మెజారిటీ తో గెలుపు కాయం అని అయన అన్నారు. ఈ కార్యక్రమం లో మాజి గ్రంథాలయ చైర్మన్ మార చంద్రమోహన్, మున్సిపల్ ఛైర్మన్ వన్నెల్దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్,ఆర్మూర్ మాజి మున్సిపల్ చైర్మన్ సంజయ్ సింగ్ బబ్ల్యూ, మాజి మున్సిపల్ వైస్ చైర్మన్ లింగ గౌడ్,ఆర్మూర్ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు ఇస్సాపల్లి జీవన్, ఆర్మూర్ మండల అద్యక్షులు చిన్న రెడ్డి ,పెర్కిట్ విండో చైర్మన్ భోజరెడ్డి మామిడిపల్లి మాజి సర్పంచ్ మారుతి రెడ్డి,మాజి కౌన్సిలర్ సడక్ వినోద్,గంగధర్, సుంకే శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular