Thursday, February 12, 2026

సాలూర మూగబోయింది

బోధన్ ప్రాంతానికి తీరని లోటు

రాజకీయాలలో కొద్ది మంది మాత్రమే ప్రజల సంక్షేమానికి కృషి చేస్తూ వారి గుండెలలో చిరస్థాయిగా నిలిచి పోతుంటారు. పదవుల కోసం పాకులాడకుండా వచ్చిన అవకాశాలను స్వప్రయోజనాల కు కాకుండా తమ ప్రాంత అభి వృద్ధి కి కృషి చేసిన బుద్దే రాజేశ్వర్ లాంటి రాజకీయ నాయకులు అరుదుగా ఉంటారు.నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంత అభివృద్ధికి విశేషం గా కృషి చేసిన బుద్ధే రాజేశ్వర్ గుండె పోటు తో మృతి చెందడం తో ప్రజలు రాజకీయ నాయకులు కార్యకర్తలు కన్నీరు మున్నిరయ్యారు. సాలుర మండల కేంద్రనికి చెందిన రాజేశ్వర్ తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుంచి రాజకీయాలలో చురుకుగా పాల్గొన్నారు. మంజీరా నది ఈ ప్రాంత సరిహద్దునుంచి ప్రవహిస్తున్న సాగునీటికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే వారు . సమస్యలను అధికారులకు విన్న వించడం తో పాటు ప్రజా ప్రతినిధులతో నిధులు మంజూరు చేయించి మంజీరా నది వద్ద ఎత్తి పోతల పథకాన్ని నిర్మించి సాలు రా రైతులకు సాగు నీరు అందేలా చర్యలు తీసుకున్నారు. రాజకీయ పార్టీల కతీతం గా నిత్యం ప్రజలతో మమేకమై ఉండే రాజేశ్వర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయం లో ఎం పి టి సి పదవికి రాజీనామా చేసి ఉద్యమ బాట పట్టారు. అనంతరం జరిగిన ఎన్నికలలో ఎం పి టి సి గా గెలుపొందారు. సాలూర లో గ్రామపంచాయతీ రెండంతస్తుల భవన నిర్మాణo అయన చొరవ తోనే జరిగింది. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన తెలుగు దేశం పార్టీ ని వీడి టి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు. పార్టీలో రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఎప్పటి కప్పుడు అధికారులను అప్రమత్తం చేశారు. మహిళా రిజర్వేషన్ రావడం తో ఆయన సతీమణి సావిత్రిని ఎం పి పి గా బాధ్యతలు చేపట్టారు. సాలు రా మండల కేంద్రము గా ఏర్పాటు చేయించడం లో ఆయన కృషి మరువలేనిది. మండల కేంద్రం ఏర్పాటుకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికి ఆయన స్థానిక ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం లో సఫలమయ్యారు.
…… రాజేశ్వర్ మృతి తీరని లోటు…
…. ప్రజా నేతగా గుర్తింపు పొందిన రాజేశ్వర్ మృతి రాజకీయ నేతలను కలిచి వేసింది. గ్రామం లో స్వచ్ఛందo గా బందు పాటించారు.రాజకీయ పార్టీల కతీతంగా ప్రజలు కార్యకర్తలు,నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. రాజేశ్వర్ తో తమకు ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తో పాటు బి జె పి నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. రాజేశ్వర్ లేని లోటు తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular