Thursday, February 12, 2026

కాసులకు మున్నూరు కాపుల సన్మానం

కామారెడ్డి జిల్లా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు మామిళ్ల అంజయ్య ఆధ్వర్యంలో బుధవారం బాన్సువాడ పట్టణంలోని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజును మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మామిళ్ళ అంజయ్య మాట్లాడుతూ మున్నూరు కాపులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజును గుర్తించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా కాపు యువతీ యువకులకు ఎంతో ఉపాధి కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా కార్యదర్శి ఆకుల శ్రీనివాసరావు విట్టల్ రావు, ఆకుల సిద్ధిరాములు, మామిళ్ళ లింగం, బాన్సువాడ పట్టణ అధ్యక్షుడు కొట్టం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular