మీడియా రంగంలో ఉత్తమ పాత్రికేయుడిగా, వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉద్యమ నాయకుడిగా దాదాపు మూడున్నర దశబ్దాలుగా విశిష్ట సేవలందిస్తున్న కే.విరాహత్ అలీ ఉత్తమ జర్నలిస్టు పురస్కారాన్ని అందుకున్నారు.

మంగళవారం రాత్రి రవీంద్ర భారతిలో, సిల్వెల్ సంస్థ, శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, ఆర్.ఆర్.ఫౌండేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో ఉత్తమ సీనియర్ పాత్రికేయులకు పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా, పది మంది ఉత్తమ పాత్రికేయులకు అవార్డులు అందించారు.
