కార్మికుల హక్కులకై మేడేను జయప్రదం చేయాలని సిపిఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ పిలుపునిచ్చారు. కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేడే పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిపిఐ మండల కార్యదర్శి విట్టల్ గౌడ్ మాట్లాడుతూ మే ఒకటి తేదీన కోటగిరి బస్టాండ్ ఆవరణలో 138వ మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని కేంద్రంలో ఉన్న నరేందర్ మోడీ కార్మికుల వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి కార్మికులను రోడ్డున పడేస్తున్నారని ప్రభుత్వ రంగాలన్నిటిని ప్రైవేటీకరణ చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధాలను అంతం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఐక్యంగా ఉండి పోరాటాలకు సిద్ధం కావాలని ఈ మేడే స్ఫూర్తిగా ముందుకెళ్లాలని పిలుపునిచారు. మే డేకు కార్మిక సంఘాలు హమాలీ తాపీ మేస్త్రి వర్కర్స్ యూనియన్ ఎలక్ట్రికల్స్ ప్రింటర్స్ కార్మికులందరూ పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటిసి నాయకులు నల్లగంగాధర్ సున్నం భరత్ సిపిఐ నాయకులు జి రాజు మాస్కుల గంగారం గొడుగు హనుమల్లు కప్ప సాయిలు వసీం తదితరులు పాల్గొన్నారు.
