Thursday, February 12, 2026

దొంగల ముఠాపై పోలీసులు నిఘా పెట్టాలి

ఓ వ్యక్తి ప్రాణాలు పొట్టను పెట్టుకున్న దొంగలు

కారేగం క్యాంపులో పట్ట పగలే మహిళపై హత్యాయత్నం గొలుసు అపహరణ

కేసులు చేదించడంలో కోటగిరి పోలీసులు విఫలం

యువత వ్యసనాలకు బానిసలై
హత్యాయత్నాలు

కోటగిరి ఎస్సై ను నియమించాలి

కోటగిరి ఉమ్మడి మండలం పరిధిలోనీ గ్రామాల్లో విచ్చలవిడిగా దొంగతనాలు కొనసాగుతున్నాయి. పట్టపగలే దొంగలు ఇళ్లల్లోకి చొరబడి వస్తువులను దోచుకోవడంతోపాటు ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడడం లేదు. కోటగిరి పోలీసులు దొంగతనాల విషయంలో విఫలమయ్యారని ప్రజలు భావిస్తున్నారు. గత 20 రోజుల క్రితం పోలీస్ స్టేషన్ పరిధిలోని దిగువ ఫారం లో దొంగలు ఒక హత్య కూడా పాల్పడ్డారు. మండలంలోనె కాకుండా బోధ న్, బాన్సువాడ డివిజన్లో పరిధిలో దొంగల ముఠా ప్రతినిత్యం ఏదో ఒకచోట దొంగతనం చేస్తూ ఉన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ఏటీఎం సైతం ధ్వంసం చేసి పెద్ద ఎత్తున నగదు దోచుకున్నారు. పోతంగల్ గ్రామంలో సైతం ఏటీఎంలో దొంగలు పడ్డారు. కోటగిరి గ్రామంలో పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఆలయంలో దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే కోటగిరి మండలంలో పోలీసులు నిఘా కరువైందని చెప్పవచ్చు. ప్రజలకు రక్షణ కల్పించే ప్రయత్నంలోనే గత ప్రభుత్వం ప్రతి పోలీస్ స్టేషన్ కు రెండు కొత్త వాహనాలను అందజేశారు. రాత్రివేళ పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు చేస్తూ పోలీసులు చేతులు దులుపుకుంటున్నారు. 20 రోజుల క్రితం హెగ్డోలి గ్రామపంచాయతీ పరిధిలోని దిగువ ఫారం గ్రామంలో వ్యక్తిని చితకబాది వంటిపై ఉన్న బంగారపు గొలుసు డబ్బులు గుర్తుతెలియని వ్యక్తులు దోచుకున్నారు. ఇంటిలో ఎవరూ లేకపోవడంతో ఉదయం వరకు విషయం వెలుగులోకి రాలేదు. ప్రతిరోజు ఉదయాన్నే మృతుడు లెగిసి తిరుగుతుండేవాడు. ఇరుగు పొరుగువారు పరిశీలించగా తలపై బలమైన గాయాలు తగిలి వ్యక్తి కింద పడి ఉన్నాడు. వెంటనే విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. బాధితున్ని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదు. వైద్యులు పరిశీలించి బలమైన గాయాలు ఒంటిపై ఉన్నాయని ఎవరో చేయి చేసుకోవడం వలనే ఈ ఘటన జరిగిందని ధ్రువీకరించారు. బాధిత కుటుంబ సభ్యులు కోటగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటువంటి సంఘటన సైతం పోలీసులు నేటికీ నిగ్గు తేల్చలేకపోయారు. పెట్రోలింగ్ చేపడుతున్న పోలీసులు ప్రజలకు రక్షణగా ఉండకుండా అక్రమ వ్యాపారుల వెంటపడుతూ రాత్రివేళ జేబులు
నింపుకుంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు కళ్ళు తెరిచి దొంగల ముఠాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మహిళను చితకబాది బంగారం గొలుసు దోచుకెళ్లిన యువ దొంగలు

కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కారేగాం క్యాంపులో పట్ట పగలే ఓ ఇంటిలో చొరబడి మామిడికాయలు కావాలంటూ మాయలో పడేసి మహిళను తలపై చితక బాబి మెడలో ఉన్న బంగారం గొలుసును దోచుకెళ్లారు. మహిళ అరుపులు కేకలు బొబ్బలు పెట్టిన ఫలితం లేకుండా పోయింది. ఆ సమయంలో ఆ ఇంటిలో ఇంటి యజమాని ఉన్నప్పటికీ వృద్ధాప్యంలో ఇంటిలో ఇరువురు సేద తీర్చుకుంటున్నారు. చాకచక్యంగా ఒక యువకుడు మాస్కు ధరించి తలుపు తట్టి మామిడికాయలు కావాలంటూ పిలవడంతో, బోసు బాబు సతీమణి భార్గవి బయటకు రావడం జరిగింది. యువకుడు మాస్కు ధరించి ఉండడాన్ని వృద్ధురాలు గమనించింది. మామిడికాయలు కావాలని చెప్పడంతో బయటకు వచ్చి మామిడి కాయలు కోసిచ్చే ప్రయత్నం చేసేటప్పుడు బలంగా తలపై బాదాడు. ఆమె తలకు బలమైన గాయాలు కావడంతో పడిపోయింది. మెడలో ఉన్న గొలుసు లాక్కుని ని తోటలోకి దొంగ పరారయ్యాడు. ఇంట్లో తన భర్త అనారోగ్యం వృద్ధాప్యం తో ఉండడంతో ఏమి చేయలేని పరిస్థితిలో ఆమె రోడ్డుపైకి వచ్చి ఇతర వ్యక్తులకు విషయాన్ని చెప్పి తన కుమారుడికి ఫోన్ ద్వారా విషయాన్ని తెలపాలని కోరింది. వెంటనే తన కుమారుడు సమీపంలో ఉండడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మహిళపై దాడి సంఘటన చుట్టుపక్క గ్రామాల్లోనీ ప్రజలు తెలుసుకుని సంఘటన స్థలానికి వచ్చి లబోదిబోమంటున్నారు. ఇలా జరిగితే గ్రామాల్లో ఒంటరిగా ఉండే కుటుంబాల పరిస్థితి గోచరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలినీ బోధన్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. విషయాన్ని పోలీసులు సైతం ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలం వద్దకు వచ్చి విషయాన్ని తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృతి నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృతి చెంది నలుగురికి తీవ్ర గాయాలైన విషయం వారం గడవకముందే ఇటువంటి సంఘటనలు ఈ ప్రాంతంలో చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. యువత వ్యసనాలకు బానిసలై మరో పక్క భారీ వాహనాలు బుల్లెట్ లాంటి వాహనాలు కొనుగోలు చేసి ఒక్కో వాహనంపై నలుగురు ప్రయాణం చేయడంతో పాటు మద్యం సేవించి, వేగంగా వాహనాన్ని నడపడంతో కారేగాం, హంగర్ గా వెళ్లే మార్గం మధ్యలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని బలంగా బుల్లెట్ తో గుద్దారు. ఈ ప్రమాదంలో ఇరువురు వ్యక్తులకు బలమైన గాయాలయ్యాయి. కారేగం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి సంఘటనా స్థలం వద్ద ప్రాణాలు విడిచాడు. బాకర్ ఫారం గ్రామానికి చెందిన మరో యువకుడు కోన ఊపిరితో ఉండి నిజాంబాద్ ఆసుపత్రిలో వైద్యం పొంది ప్రాణాలు విడిచాడు. మరో నలుగురు ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మండలంలోని పలు గ్రామాల్లో ఆకతాయిలు వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో జరిగిన సంఘటనతో గ్రామాల్లో పలు ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో ఉన్న వ్యక్తులే కొందరు ఈ దొంగతనాల్లో ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సైతం రోడ్డు ప్రమాదంలో సంబంధం ఉన్న ఇరువురు వ్యక్తులను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.

గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు

కోటగిరి మండలం పరిధిలో గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు చేపడుతున్నారు. వేసవికాలంలో ఒక్కో గ్రామంలో త్రాగునీటికి ఇబ్బందులు ఉన్నాయి కానీ, ఏ గ్రామంలో వెళ్లిన మద్యం మాత్రం ఏరులై పారుతుంది. ప్రతి చిన్న గ్రామంలో రెండు నుంచి నాలుగు బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఇప్పటికే అధికార యంత్రాంగం ఎన్నికల సంఘం గ్రామాల్లో మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయినప్పటికీ గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుంది. బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయించేవారు పోలీసులకు నజరాణాలు అందిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు పోలీసులు చేసే అక్రమాలకు పోలీస్ శాఖ అపహాస్యం అవుతుంది. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు రంగ ప్రవేశం చేసి దొంగతనాలు, దోపిడీ ముఠాలను అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మద్యంతో పాటు యువత ఆన్లైన్ గేములు ఆడుతున్నారని పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. యువత వ్యసనాలకు బానిసలై డబ్బు లేని సందర్భాల్లో ఈజీ మనీ కి అలవాటు పడి చేయరా అని పనులకు ఒడి గడుతున్నారు. ఆరు నెలలుగా కోటగిరి పోలీసులపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. పోలీసులు ప్రభుత్వ ఉద్యోగంగా భావించాలి తప్ప ప్రజలపై విత్తనం చెలాయించడం మరో పక్క అక్రమార్కులకు అండగా నిలబడి రాత్రి పగలు అనే తేడా లేకుండా తమ జేబులను నింపుకునే ప్రయత్నం ఇప్పటివరకు చేస్తూ వచ్చారు. పోలీస్ బాస్ పై పలు అవినీతి అక్రమాలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఉన్నతాధికారులు చాలా రోజులు ఆరోపణలపై పట్టించుకోలేదు. చివరిగా కోటగిరి పోలీస్ బాస్ ను వి ఆర్ కు పంపించారు. కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో కోటగిరి, పోతంగల్ మండలాలు ఉన్నాయి. మరోపక్క మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతం కావడంతో పోలీస్ శాఖ పై పెద్ద ఎత్తున బాధ్యతలు ఉన్నాయి. ఇప్పటికైనా కోటగిరి పోలీస్ స్టేషన్ కు సబ్ ఇన్స్పెక్టర్ ని వెంటనే మించాల్సిన అవసరం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular