కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిన తరుణములోనూ బిజెపి ప్రభుత్వం దేశ ప్రజలకు అండగా నిలబడిందని రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మరో ఐదేళ్లపాటు పేదలకు బియ్యాన్ని ఉచితంగా అందిస్తామని, ఉపాధి హామీ కూలీలను ఆదరిస్తామని నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్ గార్గే కూలీలకు వివరించారు.
భారతీయ జనతా పార్టీ బాన్సువాడ నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్ గార్గే ఆధ్వర్యంలో బాన్సువాడ మండలంలోని బోర్లమ్ గ్రామపంచాయతీ లోని 214 215 నంబరు గల పోలింగ్ బూత్ లలో ఇంటింటికి తిరుగుతూ జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గార్గే మాట్లాడుతూ నరేంద్ర మోడీ వ్యక్తికి ఐదు కిలోల చొప్పున ఉచితంగా కంట్రోల్ బియ్యం ఇవ్వడం జరుగుతుందని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మల్లొకసారి ఏర్పడితే మరో ఐదు సంవత్సరాల వరకు ఈ ఉచిత బియ్యం పంపిణీని కొనసాగిస్తామని చెప్పారు. గ్రామంలోని కొన్ని నిరుపేద కుటుంబాల సభ్యులు ఉపాధి హామీ పనులకు వెళ్లగా పనులు చేపడుతున్న ప్రదేశానికి వెళ్లి పలకరించి ఉపాధి హామీ పథకం కింద 300 రూపాయల కూలీని ప్రతి వ్యక్తికి అందించి నిరుపేదలకు ఉపాధిని కల్పించిన ప్రధాని మోదీ కి తమ మద్దతు తెలుపుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో బిజెపి రూరల్ మండల అధ్యక్షులు కోనాపూర్ సాయిబాబా, సీనియర్ నాయకులు డాకయ్య శ్రీనివాస్ రెడ్డి సాయి రెడ్డి చీకట్ల రాజు రాజా సింగ్ పబ్బ శేఖర్ చిరంజీవి పండరి ధనుంజయ్ గొడ్డన్ల రాజు పూసల వినోద్ నాగరాజు సంజీవరావు లు పాల్గొన్నారు.

