ఈరోజు సాలూర గ్రామ ఎంపీపీ బుద్దే రాజేశ్వర్ మృతి బోధన్ నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు అని నిజామాబాద్ పార్లమెంటు తెలుగు యువత ఇన్చార్జ్ ఏతొండ రాజేందర్ అన్నారు. రాజేశ్వర్ మొదటిసారి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీటీసీగా గెలిచి తరువాత రెండు సార్లు సర్పంచుగా గెలిచి ప్రతిక్షణం ప్రజల కోసం అనునిత్యం పోరాడిన ఏకైక వ్యక్తి రాజేశ్వర్ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుగుదేశం పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరి ఎంపీపీగా గెలిచి సాలూర నూతన మండలం ఏర్పాటులో ఆయన పాత్ర ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు పొద్దున గుండెపోటుతో మృతి చెందిన బుద్ధె రాజేశ్వర్ భౌతిక దేహం వద్దకు వెళ్లి పూలమాల

వేసి కన్నీటి పర్వతమైన నిజామాబాద్ పార్లమెంటు తెలుగు యువత ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ రాజేశ్వర్ ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రజలకు ఏ కష్టం వచ్చినా బోధన్ నియోజకవర్గం లోని అన్ని వర్గాల ప్రజల కోసం నిరంతరం అందుబాటులో ఉండి మీకు నేనున్నానంటూ భరోసా కల్పించిన వ్యక్తి ఈరోజు చనిపోవడం చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతున్ని కోరుకుంటూ మరియు వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని తన ప్రకాడ సానుభూతి మరియు సంతాపం తెలియజేశారు…
