ప్రవాస భారతీయుల సంక్షేమమే తన లక్ష్యం

రైతు సమస్యలపై ప్రతినిత్యం ఉద్యమిస్తూ మరోపక్క ప్రభాస్ భారతీయుల సమస్యలపై గళం విప్పుతూ ఉండే కోటపాటి నరసింహనాయుడు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పసుపు బోర్డ్ పోరాట సమితి అధ్యక్షులు మరియు గల్ఫ్ సౌదీ అరేబియా ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కోటపాటి వారి సమస్యల పరిష్కారమే తన ధ్యేయంగా భావిస్తూ బిజెపి పార్టీలో చేరినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బిజెపి కార్యాలయంలో ఓ బి సి మోర్చా జార్జియాధ్యక్షులు లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. భారతీయ జనతా పార్టీ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తిరిగి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న నమ్మకముతోనే తాను పార్టీలో చేరినట్లు తెలిపారు. తనకు పదవులు ఆస్తులు పట్ల ఈనాడు ఆశ లేదని తనకు ప్రజా సమస్యల పరిష్కారం వల్లే సంతృప్తి కలుగుతుందన్నారు. ఆయనతోపాటు కొక్కుల విద్యాసాగర్ పార్టీలో చేరారు.
