తెలంగాణ ప్రజలు 10 ఏళ్లు కేసిఆర్ కు అధికారమిస్తే రాష్ట్రాన్ని తన సొంత జాగీరు లాగా భావించి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించడంతోపాటు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి ఎత్తివేసారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.వందరోజుల పాలనలో చేసిన అభివృద్ధితో పాటు ఈ ప్రాంతానికి మా కుటుంబం ఎంతో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు రాత్రి పగలు అనే తేడా లేకుండా అండగా నిలబడి ఉన్నామని, ప్రజలు కూడా తాము ఎన్నికల్లో నిలబడితే ఏనాడు తమను కాదని నిరాకరించలేదని మంత్రి అన్నారు. దేశంలోనే నల్గొండ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ మెజారిటీ వస్తుంది.
తెలంగాణను అన్ని రంగాలలో విధ్వంసం చేసిన చరిత్ర కేసీఆర్‌ది.నల్గొండలో ఫ్లోరైడ్‌ను తరిమేశానని కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు.
కాంగ్రెస్ 14 సీట్లకు పైగా గెలుచుకుంటుంది. అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
