Thursday, February 12, 2026

ఓటు హక్కు వినియోగంపై మహిళలకు అవగాహన

పార్లమెంట్ ఎన్నికల స్వీప్ కార్యక్రమంలో భాగంగా “I VOTE FOR SURE” అనే టీం తో బుధవారం ఆర్మూర్ మునిసిపల్ పరిధి లోని రాంనగర్ సి ఆర్ సి భవనం నందు టీ ఎల్ ఎఫ్ సభ్యులకు ఓటు హక్కు పై అవగాహన కల్పించారు. మహిళలందరు మీరు మీ కుటుంబ సభ్యులు ఓటు వేయడం మాత్రమే కాకుండా మీ చూటుపక్కన వాళ్లు, కాలనీ వాళ్ళు ఎస్ హెచ్ జి గ్రూపుల సభ్యులు అందరు ఓటు హక్కును వినియోగించుకునేలా వారికి అవగాహన కల్పించాలని, ఆర్మూర్ నియోజక వర్గం లో ఓటింగ్ శాతంను గతంలో కంటే మెరుగ్గా అయ్యేట్టు చూడాలని, మున్సిపల్ కమిషనర్ సూచించారు.ప్రలోభాలకు గురికాకుండా ఓటు వేయాలని మరియు అందరిచే ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.
ఇట్టి కార్యక్రమంలో ఎస్ వి ఈ ఈ పి నోడల్ అధికారి మరియు కమీషనర్ రాజు గారు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూమేశ్వర్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, టీఎంసీ ఉదయ్ శ్రీ, , సీసీ రాజలింగం మరియు మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular