Thursday, February 12, 2026

మతోన్మాద బిజెపిని ఓడించాలి

సిపిఎం పిలుపు

నిజామాబాద్ జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. 18వ పార్లమెంటు ఎన్నికల ప్రణాళికను బుక్ లెట్ ను విడుదల చేశారు.అనంతరం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ మే 13న జరగబోయే ఎన్నికల్లో ఇప్పటికే మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో దేశ లౌకిక ప్రజాస్వామిక విలువలను సంక్షోభంలోకి నెట్టివేయడంతో పాటు ఆర్థిక స్వావలంబన, సామాజిక న్యాయం ,ప్రజాస్వామ్యం, సమాఖ్య భావన ధ్వంసం చేసిందన్నారు. సంస్థలను అడ్డగోలుగా దుర్వినియోగం చేసి నియంతృత్వ విధానాలతో దేశంలోని కార్మికుల కష్టజీవుల మీద పెను భారాలను మోపి, దరిద్రం, పేదరికం పెరిగిందని ఆయన విమర్శించారు.
అందువల్ల ప్రజానీకం లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఏ మాత్రం అనాలోచి తానికి గురికాకుండా మతోన్మాద బిజెపిని ఓడించి కూటమి అభ్యర్థులను గెలిపించటానికి జిల్లాలో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బిజెపి ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చి మతోన్మాదాన్ని ప్రేరేపించాలని తద్వారా ఓట్లను పొంది రాజకీయ పీఠాన్ని అధిరోహించటానికి చూస్తున్నారని ప్రజలు దాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్, వెంకటేష్, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు వేషాల గంగాధర్, కొండ గంగాధర్, జంగం గంగాధర్, నన్నే సాబ్, సుజాత, సూరి, విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular