Thursday, February 12, 2026

కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి గా నామినేషన్

కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి పట్టాసంగా నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. భారీ ర్యాలీతో కార్యకర్తలు సందడితో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో తన ముఖ్య అనుచరులతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందించారు. శాసనసభ ఎన్నికల సమయంలో హుస్నాబాద్ నియోజకవర్గ టికెట్ ఆశించి టికెట్ దక్కకపోయినప్పటికీ అధిష్టానం ఆదేశాల మేరకు మరి నుండి తప్పుకొని కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేశారు. పార్టీ అభివృద్ధికి చేసిన కృషి ఫలితంగానే నేడు పార్లమెంట్ టికెట్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కేటాయించింది. ప్రజాసేవకుడిగా ప్రజల గుండెల్లో ఆయన మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ కార్యక్రమంలో ములకనూర్ మాజీ సర్పంచ్ మంగ రామచంద్రం, నాయకులు కేతరి లక్ష్మారెడ్డి బొజ్జపురి అశోక్, కొడగండ్ల సుదర్శన్ రెడ్డి, రాజయ్య, జోగి రెడ్డి, జిమ్మల భీమ్ రెడ్డి, కేతిరి లక్ష్మా రెడ్డి, గూడ యాదగిరి, కర్ర రవిందర్ రెడ్డి, చందరాజు శంకర్, గద్ద అయిలయ్య, మాడుగుల చింటు, శ్రీకాంత్ మ్యాదరబోయిన, గోనెల సంపత్ బొట్టు మొగిలి, వెంకట్ స్వామి, సదానందం, తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular