తెలంగాణ రాష్ట్రంలోని మూడు పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడ్డది. ఎట్టకేలకు బుధవారం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎంపికకు కాంగ్రెస్ అధిష్టానం తెరదింపింది. నెల రోజులుగా ఎంపికలో ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని ఊహకు అందని విధంగా తె రపైలేని వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకులు రామ సహాయం రఘురామిరెడ్డిని ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసేందుకు ఎంతోమంది ఎవరి వంతు ప్రయత్నం వారు చేశారు. చివరిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై చేయిగా నిరూపించుకున్నారు. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి గురువారం నామినేషన్ వేయనన్నట్లు పార్టీ వర్గాలు తెలిపారు. కరీంనగర్ నుండి వెలి చాలా రాజేంద్ర రావు, హైదరాబాదు నుండి ఎండి వలీయుల్ల ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది.
పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికకు తెరదింపిన కాంగ్రెస్
RELATED ARTICLES
