Thursday, February 12, 2026

మడికొండ ఈనాడు ఆఫీస్ ఎదురుగా ఉన్న స్థలంలో హనుమకొండ డిసిసి అధ్యక్షులు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఓరుగల్లు జన జాతర సభలో మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, సీతక్క మరియు సహచర శాసనసభ్యులు స్టేషన్గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి, తో కలిసి పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు.

👉 కేంద్రంలో రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రిగా చూడాలంటే మన వరంగల్ లో కడియం కావ్య ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఒకసారి ఆలోచించండి 10 సంవత్సరాలలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో ఒకసారి పునరాలోచించుకోండి. ఆరూరి రమేష్ అనే వ్యక్తి వర్ధన్నపేట లో చెల్లని రూపాయి గా ప్రజలు తిరస్కరించి పంపిస్తే బిజెపి పార్టీ వాషింగ్ మిషన్ కడిగి మన ముందుకుమళ్ళీ తీసుకొని వచ్చిందని దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. పాత మరకలు, కంపు ఎక్కడ పోలేదని ప్రజలు మరల బుద్ధి చెప్తారు. 10 సంవత్సరాలలో ఆరూరి రమేష్ రైతుల భూములు లాక్కొని కొట్టి జైల్లో పెట్టిన విషయం యావత్ వరంగల్ ప్రజానీకం మొత్తానికి తెలుసు. మళ్లీ ఇప్పుడు 7 నియోజకవర్గాలలో ఉన్న భూములను లాక్కోవడానికి బిజెపి పార్టీతో మన ముందుకు వస్తున్నాడు ప్రజలారా గమనించండి. అని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా వర్ధన్నపేట ప్రజానీకం ఎలా అయితే తిరస్కరించి పంపారో మిగతా 6 నియోజకవర్గాలు కూడ చెల్లిని రూపాయిగా తన్ని తరిమికొట్టాలి అని పిలుపునిచ్చారు
రియల్ ఎస్టేట్ మాఫియా తో వ్యాపారస్తులను రైతులను ఇబ్బందులకు గురి చేస్తాడు.
మనకు ప్రధాన సమస్య మడికొండ డంపింగ్ యార్డ్ ను వేరే చోటికి తరలించాలని సీఎం కి విన్నవించడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా నిరుద్యోగ సమస్య ఉంది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తీసుకొచ్చేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ని కోరడం జరిగింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకొని వచ్చి ప్రభుత్వ యూనివర్సిటీలను పట్టించుకోక నాశనం
చేసింది దాని మీద కూడా దృష్టి పెట్టాలని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా వరంగల్ ఎడ్యుకేషన్ హబ్, ఐటీ హబ్ చేసి మరియు మామునూర్ ఎయిర్పోర్టును పునరుద్ధరిస్తే విదేశాల నుంచి చాలా పెట్టుబడులు వచ్చే అవకాశం తో పాటు విద్య, వైద్యం, ఉద్యోగపరంగా వరంగల్ విజయవంతం అవుతుందని తెలియజేయడం జరిగింది. కాబట్టి సోదర సోదరీమణులారా ఒకసారి ఆలోచించండి చదువుకొని డాక్టర్ వృత్తిలో ఎన్నో సేవలు చేసిన మన అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య ని మనందరం భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకి పంపిస్తే పార్లమెంట్లో కొట్లాడి నిధులు తీసుకువచ్చి వరంగల్ ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్తుంది.
ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటు వేసి మన అభ్యర్థి కడియం కావ్య ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.
ఇంత పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, వివిధ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు జిల్లా, మండల, గ్రామ స్థాయిల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular