ఎన్నికల ప్రచారంలో ప్రసంగించిన మాజీ సభాపతి పోచారం


పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండల కేంద్రం మరియు కామారెడ్డి పట్టణంలో జరిగిన రోడ్ షో మరియు కార్నర్ మీటింగ్ లలో జహీరాబాద్ టిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనీల్ కుమార్ తో కలిసి పాల్గొన్న మాజీ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
పాల్గొన్న కామారెడ్డి, ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, జనార్దన్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, పట్టణ, మండల, గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు ఆయుదం. మేలు చేసేవారికి ఓటు వేస్తేనే మన బతుకులు, మన పిల్లల బతుకులు మారుతాయి. అందుకే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలనీ పోచారం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.పాలిచ్చే బర్రెకు గడ్డి వెయ్యాలి కాని గొడ్డు బర్రెకు కాదు. అదేవిధంగా పని చేసే వారికే ఓటు వేయాలి.
మాట చెప్పి నిలబెట్టుకున్న వారిని గెలిపించుకుందామా లేక మాటలు చెప్పి మోసం చేసిన వారిని గెలిపిద్దామా ??
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రైతుబంధు ఇస్తానని ఇచ్చిండు, పెన్షన్ మొదట రూ. 1000 తరువాత రూ. 2000 చేసిండు. పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి రూ. లక్షా నూటపదహార్లు ఇచ్చిండు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లు ఇచ్చారు.24 గంటల కరంటు సరఫరా చేసినం, బతుకమ్మ పండుగకు ఆడబిడ్డకు చీరలు ఇచ్చినం. రంజాన్ పండుగకు ముస్లిం లకు, క్రిస్మస్ పండగకు క్రిస్టియన్ లకు బట్టలు పంపిణీ చేశాం.అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. కానీ ఇంతవరకు హామీలు అమలు కాలేదు.రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు మీకు అందితే అందరూ కాంగ్రెస్ కే ఓటు వేయండి. లేకపోతే బుద్ధి చెప్పండి.రైతుబంధు ఎకరాకు రూ. 15,000,
కౌలు రైతులకు ఎకరాకు రూ. 15,000, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000, వరి పంటకు క్వింటాలుకు రూ. 500 బోనస్,18 ఏళ్ళు దాటిన మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇయ్యలేదు.అదేవిధంగా ఆసరా పెన్షన్ రూ. 4000 కు పెంచుతామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4000 ఇస్తామన్నారు. 24 గంటల కరెంటు ఇస్తామన్నారు.
డిసెంబర్ 9న ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు లేదు. 200 యూనిట్ల వరకు కరంటు ఫ్రీ అన్నారు, లేదు. రూ. 500 కు గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నాడు. ఎక్కడా లేదు.
ఇందులో ఏది కూడా అమలు చేయడం లేదు. హామీలు ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డికి ప్రజలు ఓటు తో బుద్ది చెప్పాలి.
మహిళలు నెత్తిన బిందే పెట్టుకుని మోయకూడదనే ఉద్యేశంతో మిషన్ భగీరథ పథకాన్ని కేసీఆర్ నిర్మిస్తే, ఇప్పుడు త్రాగునీరు సరఫరా చేయలేక పోతున్నారు.
మళ్ళీ మహిళలు బిందెలు మోసే పరిస్థితి నెలకొంది.
పంటలు వేసిన తరువాత ఎంక్వైరీ చేసి రైతుబంధు ఇస్తామని కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు. రైతుబంధు అనేది పంట పెట్టుబడి కోసం ఇచ్చేది. కాంగ్రెస్ నాయకులకు ఓట్లు, అధికారం కావాలి. ప్రజల కష్టాలు అవసరం లేదు.కేసీఆర్ కామారెడ్డి ని నూతన జిల్లాగా ప్రకటిస్తే, మోడి కామారెడ్డి జిల్లాకు నవోదయ పాఠశాల ఇవ్వలేదు. దేశంలో 150 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటి కూడా ఇవ్వలేదు.
సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని యువకులను మోసం చేసిండు. ప్రజలారా బిజెపి కి ఓటు వేసి ఇంకోసారి మోసపోకండి. పదేళ్ళు పార్లమెంట్ సభ్యులుగా పనిచేసి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్న బిబి పాటిల్ ఏ పని చేయలేదు. అందుకే ఓటుతో బుద్ధి చెప్పాలి.
అంతకు ముందు అయిదేళ్ళు పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన కాంగ్రెస్ అభ్యర్ధి సురేష్ షెట్కార్ కూడా ఏం పని చేయలేదు.ఏ పని చేయని వాళ్ళకు ఎందుకు ఓటు వెయ్యాలి.తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో నడిచిన వ్యక్తి అనీల్ కుమార్ . అనీల్ కుమార్ గెలిస్తే మన బతుకులు, మన బిడ్డల బతుకులు బాగుపడుతాయి.
అందరూ కారు గుర్తుపై ఓటు వేసి BRS పార్టీ అభ్యర్థి గాలి అనీల్ కుమార్ ని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
