*మిర్యాలగూడ బస్ స్టాండ్ ప్రాంగణం నుంచి రాజీవ్ చౌక్ వరకు కొనసాగిన మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి బస్సు యాత్ర కొనసాగింది.
*రాజీవ్ చౌక్‌లో ప్రసంగించిన కెసిఆర్* లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరుణంలో, ప్రజల్లోకి మరింత వెళ్లాలనే ఉద్దేశ్యంతో, పార్టీకి పూర్వవైభవమే ధ్యేయంగా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో, పోరుబాట పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 24 నుంచి మే 10 వరకు బీఆర్‌ఎస్ అధినేత మాజీ సీ.ఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు. మిర్యాలగూడ పట్టణం నుండి అశేష జనవాహిని, బీఆర్‌ఎస్ అభిమానులు, కార్యకర్తల నడుమ బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ బస్సు యాత్ర మిర్యాలగూడ పట్టణం నుంచి రాజీవ్ చౌక్ వరకు కొనసాగింది.





