Tuesday, December 16, 2025

రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో నలుగురు స్నేహితులు మృతి: మరణంలోనూ వీడని స్నేహం

నలుగురు విద్యార్థులు రోడ్డు ప్రమాదం లో మృత్యువాతకు గురయ్యారు. మరణములోనూ వారి స్నేహం విడదీయరాని బంధంగా మిగిలిపోయింది.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్‌ విద్యార్థు లు మృతి చెందారు.వీరంతా 17 ఏళ్ల వయసు వారే. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ధన్నపేట కు చెందిన పొన్నం గణేష్, ఇల్లందు గ్రామానికి చెందిన మల్లేపాక సిద్ధు, వరుణ్‌ తేజ్‌, పొన్నాల ఆనిల్‌ కుమార్‌లుగా గుర్తింపు..ఒకే ద్విచక్ర వాహనంపై ఇల్లంద నుంచి వర్ధన్నపేట వైపు వెళుతుండగా ఎదు రుగా వస్తున్న ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సు ఢీ కొట్టింది. బస్సు హనుమకొండ జిల్లాలో బుధవారం నిర్వహించిన ఎన్నికల సభకు ప్రజలను తరలించి తిరిగి ఖాళీగా వెలుతున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్టు తెలిసింది. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీరిలో గణేష్ బుధవారం వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణులై య్యాడు.అతను తన ముగ్గురు స్నేహితులతో కలిసి సాయంత్రం విందు చేసుకొని ఒకే ద్విచక్ర వాహనంపై తిరిగి ఇళ్లకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు నలుగురు విద్యార్థులు సుమారు 50 మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా ఎగిరి పడ్డారు.వీరంతా వారి తల్లిదండ్రులకు ఒక్కరే కుమారులు. ఇల్లందు గ్రామానికి చెందిన ముగ్గురు ఒకే రోజు చనిపోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.ఘటనా స్థలం వద్ద మలుపు ఉండటం. రెండు వాహనా లు వేగంగా రావడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular