కామారెడ్డి జిల్లాకు చెందిన సుభాష్ రెడ్డి మళ్ళీ సొంత గూటికి చేరారు. పదేళ్లపాటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో క్రియాశీలక పాత్ర పోషించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశపడి చివరిలో రెండుసార్లు బంగ పాటు గురయ్యారు. వడ్డేపల్లి టికెట్ ఆశించినప్పటికీ చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ మదన్ మోహన్ రావు అభ్యర్థిగా ప్రకటించారు. ఆనాడు భావోద్వేగానికి గురై కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టారు. ఆయన వర్గీయులు తాడోపేడో తెలుసుకోవాల్సిందేనని పట్టుపట్టారు. అధిష్టానం తన నిర్ణయం మార్చుకో పోవడంతో సుభాష్ రెడ్డి బిజెపి పార్టీలో చేరి బిజెపి టికెట్ పొందారు. శాసనసభ ఎన్నికల్లో ఆయనకు ఫలితం దక్కలేదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై మళ్లీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
