నిజాంబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు కోసం బోధన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. పట్టణంలోని 10,11, 12 ,25 వార్డులలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజల దారిన చేర్చిందని, మరికొన్ని హామీలను త్వరలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని కాంగ్రెస్ నాయకులు శరత్ రెడ్డి ప్రజలకు వివరించారు. స్థానిక ప్రజలకు ఏ సమస్యలున్నా పరిష్కారానికి స్థానిక నాయకులు సిద్ధంగా ఉన్నామన్నారు. గతంలో బోధన్ ఎమ్మెల్యే బోధన్ అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం చేశారని అందుకే శాసనసభ ఎన్నికల్లో ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పారని హెచ్చరించారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే మచ్చలేని నాయకుడని ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశలో అడుగులు వేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారని ప్రజలకు వివరించారు. ఆయన నాయకత్వంలో బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ప్రజలందరూ ఓటు వేయాలని ఓటర్లకు అభ్యర్థించారు. ఇంటింటి ప్రచారంలో మాజీ ఎంపీపీ గంగ శంకర్, మాజీ ఏఎంసీ పాషా మయినుద్దీన్, కౌన్సిలర్ దాము, పలువురు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.




