గూడూరు మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్టే వెంకన్న ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల ముఖ్య నాయకుల,కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ బి.అర్.ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు రమేష్ చందర్ రెడ్డి ,ప్రదీప్ రెడ్డి మరియు మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

