Friday, February 13, 2026

కాంగ్రెస్ లోకి వైఆర్ డేవిడ్

  • ఎమ్మెల్సీ మహేష్ కుమార్, ఎంపి అభ్యర్థి జీవన్ రెడ్డి సమక్షంలో చేరిక పలువురి హర్షం
    సీనియర్ రాజకీయవేత్త , క్రిస్టియన్స్ అసోసియేషన్స్ జిల్లా అధ్యక్షులు వైఆర్ డేవిడ్ తన వందలాది అనుచరగణంతో కలిసి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో అయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నిజామాబాద్ నగరంలోని న్యాల్కల్ రోడ్డు మున్నూరు కాపు సంఘంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ…యువజన కాంగ్రెస్, కాంగ్రెస్ నాయకులుగా గతంలో డేవిడ్ చేసిన సేవలు అమోఘమని కొనియాడారు. వ్యక్తిగత కారణాలతో మధ్యలో రాజకీయాలకు దూరమైన, తిరిగి తాను నమ్మిన కాంగ్రెస్ పార్టీలో చేరడం అభినందీయమని ప్రశంసించారు. డేవిడ్ చేరికతో మైనార్టీ వర్గాల్లో కాంగ్రెస్ మరింత బలపడనుందని, నగరంలో పార్టీకి బలం చేకూరనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ… దేశాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించే మతతత్వ పార్టీలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. డేవిడ్ మాట్లాడుతూ…తనపై నమ్మకంతో పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎంపి అభ్యర్థి జీవన్ రెడ్డి, ఉర్దూ అకాడమి రాష్ట్ర చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, పార్టీ నగర అధ్యక్షులు కేశ వేణు, ఇతర కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పటిష్టతకు, ఎంపి అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. గతంలో మాదిరి పార్టీకి సేవలు అందిచడంలోముందుంటానని, పార్టీ మైనార్టీ విభాగం పటిష్టతకు పాటుపడతానని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షులు గడువు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ మేయర్ ఆకుల సుజాత, పార్టీ రాష్ట్ర నాయకులు నరాల రత్నాకర్, మాజీ కార్పొరేటర్లు, క్రిస్టియన్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular