Monday, December 15, 2025

బాజిరెడ్డి ని భారీ మెజారితో గెలిపించుదాం

నిజాంబాద్ పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ప్రజలకు పిలుపునిచ్చారు. నిజాంబాద్ పట్టణంలో పలు వార్డులలో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 37వ డివిజన్ మైసమ్మ మందిరం కెనాల్ కట్ట వద్ద నుంచి టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కోసం మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ ఎంపీ బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు.
రాముడు కోసం లక్ష్మణుడి లా గణేష్ బి గాల నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు.
ఢిల్లీలో ప్రశ్నించే గొంతును గెలిపించుకోవడమే లక్ష్యమని భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు.
అభివృద్ధి అంటే కెసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో 50 సంవత్సరాల అభివృద్ధిని చేసి చూపించిన ఘనత మాదే అన్నారు.
కెసిఆర్ ప్రభుత్వంలో 24 గంటల కరెంటు, రైతులకు నీరు అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుమని పది రోజులు కాకముందే కరెంటు కట్, పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.
ప్రజలను మోసం చేసి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గారంటీలను అట్టకెక్కిచ్చిందని అన్నారు. ఏం చేయాలన్నా టిఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని కెసిఆర్ నీ మళ్లీముఖ్యమంత్రి చూడాలని ప్రజలు భావిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్,డివిజన్ అధ్యక్షులు ప్యాట సంతోష్,ప్రభాకర్ రెడ్డి,సుజిత్ సింగ్, సత్యప్రకాశ్, నరేష్ యాదవ్, డివిజన్ ప్రజలు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular