అశేష జన వాహిని తో దద్దరిల్లిన శంకరంపేట్






శంకరంపేట్ లో జరిగిన జన జాతర బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
పదేళ్లపాటు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు తెలంగాణ రాష్ట్రానికి ఏమి వరగ పెట్టారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన ఘనత సోనియా గాంధీ దేనని, పదేళ్లపాటు అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకుని కేసీఆర్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని, తెలంగాణ తల్లికి వేసిన సంకెళ్ళకు తెలంగాణ ప్రజలు శాసనసభ ఎన్నికల్లో సంకెళ్ళకు విముక్తి కలిగించారని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అధికారం కోల్పోయిన గులాబీ దళపతి వారి సేన జీర్ణించుకోలేక ప్రతినిత్యం విమర్శలను చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. తమ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి రుణము నుండి రైతులను విముక్తి చేస్తామన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పంట రుణాలను మాఫీ చేసిందని, ఆనాడు ఇందిరమ్మ పేరిట ప్రతి పేదవానికి ఇంటిలో నిర్మాణానికి నిధుల అందించిన ఘనత కాంగ్రెస్ కే దక్కిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని నాలుగు లక్షల మంజూరు చేసి పేదలను ఆదుకుంటామన్నారు. ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షలతో ప్రారంభించి నేడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే పేదలకు వైద్యం అందించాలన్న దృఢ సంకల్పంతో 10 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. బిజెపి మతాల పేరిట ప్రజలను విడగొట్టి దేశాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుపొందబోతుందని రాబోయే రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీ లతోపాటు కేంద్ర ప్రభుత్వం మరో ఐదు గ్యారెంటీలను అమలు చేయబోతుందని అన్నారు. నిరుపేదలకు భారంగా మారిన వంటగ్యాసును నేడు 500 కి అందిస్తున్నామన్నారు. వ్యవసాయదారులకు ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నామని, పేదలకు విద్యుత్ ఉచితంగా అందించాలన్న దృఢ సంకల్పంతో పేదల గృహాలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ ఉచితంగా అందిస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బిజినెస్ పటేల్ చిత్తుచిత్తుగా ఓడించి ఈ ప్రాంత అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేసే మీలో కలిసిపోయే వ్యక్తి సురేష్ శెట్కర్న్ ను భారీ మెజార్టీతో గెలిపించి ఢిల్లీకి పంపించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వెంట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ, జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి,ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, నాయకులు బుజ్జి, అబ్దుల్లా, గిరిజన రాష్ట్ర నాయకులు ప్రతాప్ సింగ్, నాగనాథ్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.
