ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజ్









జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, గత 15 ఏళ్ల నుండి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం కుంట్టు పడిందని ఆగ్రోస్ ఇండస్ట్రీస్ రాష్ట్ర చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు.జుక్కల్ మండల కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షేట్ కార్ కు మద్దతుగా రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ గడపగడపకు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న గ్యారెంటీ పథకాల గురించి ప్రజలకు వివరించారు. గతంలోనూ రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ నుండి నేటి వరకు గులాబీ పార్టీ రైతులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. రైతుల పంట రుణాలను ముఖ్యమంత్రి కేసీఆర్ మాఫీ చేస్తారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని, ఆగస్టు 15 లోపు రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీని చేస్తుందన్నారు. వెయ్యి రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ను 500 కే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అందిస్తుందని వివరించారు. గతంలో గృహ వినియోగదారులు ఒక నెల బిల్లు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేసేవారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే పేదల గృహ విద్యుత్ సరఫరా ఉచితంగా పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుందని కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరో అయిదు గ్యారెంటీ ల అమలకు ఇప్పటికే రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన విషయాన్ని ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అసుపత్వార్ వినోద్, కామారెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఖలేఖ్ మండల అధ్యక్షుడు సంజు పటేల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మనోహర్, ఇమ్రాన్ ఖాన్, మాజీ సర్పంచ్ అనిల్, విటల్, సాయిలు., అనీల్ సెట్ , అనిల్ , కే సాయిలు , కండె రావు , తుకారాం పటేల్ , అరుణ్, రోషన్ ,సాయినాథ్ , కృష్ణ , మారుతీ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు
