100 కోట్లతో బతుకమ్మ తల్లి దేవాలయం

ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత, సహస్ర మహోత్సవ సమ్రాట్, బతుకమ్మ తల్లి గ్రంథకర్త, విశ్వ కళా విరాట్ డాక్టర్ శాంతి కృష్ణ ఆచార్య కు అభినందన వెలువలు. వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు శనివారం ఉదయం హనుమకొండ లోని వారి నివాసంలో ప్రత్యేకంగా సన్మానించి అభినందనలు తెలిపారు.డాక్టర్ శాంతి కృష్ణ ఆచార్య వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం లోని బతుకమ్మ తల్లి జన్మస్థలమైన చౌటపల్లి గ్రామంలో సుమారు 100 కోట్లతో నిర్మించ తలపెట్టిన బతుకమ్మ తల్లి తొలి దేవాలయం నిర్మాణ నిమిత్తమై మే నెలలో అమెరికాలో పర్యటించనున్న వాషింగ్టన్ డిసి వైట్ హౌస్ లో వికాన వారి అంతర్జాతీయ ప్రోగ్రాంలో, డల్లాస్ లో గ్లోబల్ విశ్వకర్మ వారు నిర్వహిస్తున్న కాన్వికేషన్ లో, సియటెల్ లో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) వారు నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహోత్సవాలలో మరియు తదితర తెలుగువారి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. బతుకమ్మ తల్లి విశిష్టత విశ్వవ్యాప్తం గావించనున్నారు. వర్థన్నపేట శాసనసభ్యులు నాగరాజు వారి నివాస గృహంలో డాక్టర్ శాంతి కృష్ణ ఆచార్య ని అభినందించి అమెరికా పర్యటన విజయవంతం కావాలని బతుకమ్మ తల్లి తొలి దేవాలయ నిర్మాణం వీలైనంత త్వరలో ముఖ్యమంత్రి *ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుటకు అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం సహాయ, సహకారం అందిస్తుందని ఆయన తెలియజేశారు.కార్యక్రమంలో చౌటపెల్లి గ్రామ పూర్వ సర్పంచ్ వంగాల వెంకటేశ్వర్లు వర్థన్నపేట నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు.




