సోషల్ మీడియా వారియర్స్ను అభినందించిన సీఎం
హైదరాబాద్: జూబ్లీహిల్స్ లోని శ్రీ రేవంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయం లో టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీష్ మరియు టిపిసిసి సోషల్ మీడియా స్టేట్ కో ఆర్డినేటర్ నవీన్ నిర్వహించిన సోషల్ మీడియా ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు టిపిసిసి మీడియా కమ్యూనికేషన్స్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో అర్మూర్ అసెంబ్లీ మీడియా , జిల్లా కోఆర్డినేటర్లు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, మండల కోఆర్డినేటర్లు రటం అరుణ్.కొండూరు దేవిదస్ గౌడ్, గంగాసరం సాయన్న. కల్లెడ శివ,సుమన్. రాజు పాల్గొన్నారు.
సోషల్ మీడియాతోనే అధికారంలోకి వచ్చాం
*శాసనసభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కష్టపడి పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. నాయకుడు ఎన్ని ప్రసంగాలు చేసినా సరే అది ప్రజలకు చేరాలంటే కేవలం మీ సోషల్ మీడియా ద్వారానే అది సాధ్యం. మీరంతా కలిసికట్టుగా పని చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రచార కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళుతున్నాయి. సోషల్ మీడియా కృషివల్లే శాసనసభ ఎన్నికల్లో అధికారంలోకి రాగలిగామని సోషల్ మీడియా వారియర్స్ ను ముఖ్యమంత్రి అభినందించారు.
లోక్ సభ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. ఒక యుద్ధం చేయబోతున్నాం. యుద్ధ సమయంలో సైనికులకు వారి సెలవులను రద్దు చేసి యుద్ధంలో పాల్గొనమని చెప్తారు. ఇప్పుడు మనకు కూడా అలాంటి సమయమే. ప్రతి ఒక్కరు యుద్ధంలో పాల్గొని విజయం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.


