Monday, December 15, 2025

కాంగ్రెస్ పార్టీ హామీల మాటేమిటి?

పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన పోచారం భాస్కర్ రెడ్డి

శాసనసభ ఎన్నికల సమయంలో అమలు చేయలేని హామీలను గుప్పించి ప్రజలను మోసం చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టిందని మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని ప్రజల తిప్పి కొట్టాలని ఉమ్మడి నిజాంబాద్ జిల్లా సహకార బ్యాంక్ మాజీ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు.
నాలుగు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికలలో బాన్సువాడ నియోజకవర్గం నుండి పోచారం శ్రీనివాసరెడ్డి కి మంచి మెజారిటీ ఇచ్చారు.

ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీ ఆర్ఎస్ పార్టీఅభ్యర్థి గాలి అనీల్ కుమార్ కి మనమందరం మద్దతు తెలిపి మంచి మెజారిటీతో గెలిపించాలి.మన బాన్సువాడ నియోజకవర్గంలో బి ఆర్ ఎస్ గెలిచినా రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అయింది. డిసెంబర్ 9 అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఎవరికైనా వచ్చిందా అని రైతన్నలను అడుగుతున్నా. రైతుబంధు ఎకరాకు రూ. 15,000, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000, వరి పంటకు క్వింటాలుకు రూ. 500 బోనస్,18 ఏళ్ళు దాటిన మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ప్రజల ధరిన చేరలేదన్నారు. ఆసరా పెన్షన్ రూ. 4000 కు పెంచుతామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4000 ఇస్తామన్నారు. 24 గంటల విద్యుత్ ఇస్తామన్నారు.
సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ ఇస్తాం, 200 యూనిట్ల వరకు కరంటు ఫ్రి అన్నారు. ఏవి లేవు.కాలేజీ లకు వెళ్ళుతున్న యువతులకు స్కూటీలు ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు.వాళ్ళు అమలు చేస్తున్న ఏకైక హామీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఖర్చు రోడ్డు రవాణా సంస్థ భరిస్తుంది. కాబట్టి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంతో ప్రభుత్వానికి ఖర్చు లేదు, ఉద్దెర పథకం అన్నమాట. రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కి నష్టాలు వస్తున్నాయనే సాకుతో ఎన్నికలు అయిపోగానే ఈ ఉచిత ప్రయాణంను ఎత్తివేస్తారు.రద్దీకి అనుగుణంగా అవసరమైనన్ని బస్సులను ఏర్పాటు చేయకపోవడంతో ప్రస్తుతం మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. సీట్ల కోసం నిత్యం గొడవలు జరుగుతున్నాయి.మగవారికి అసలు బస్సులో చోటు ఉండడం లేదు.ఉచిత ప్రయాణం పథకంతో బస్సులలో రద్దీ పెరుగుతదని తెలిసినా బస్సుల సంఖ్యను పెంచడం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు పేదలకు ఠంచనుగా పెన్షన్లు వచ్చేవి. రైతుబంధు డబ్బులు సమయానికి రైతుల బ్యాంకు అకౌంట్లలో వేసేవారు. పెళ్ళైన రెండు నెలలోనే కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం లక్షా నూటపదహార్లు అందేవి.
తొమ్మిదేళ్లు 24 గంటలు కరంటు ఉండేది. ఇప్పుడు రోజు కరంటు పోతుంది. ఎందుకు పోతుందో ప్రజలు ఆలోచించాలి రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాల పంటలు ఎండిపోయాయి.ఉన్న నీటిని సక్రమంగా వాడుకునే తెలివి లేక పంటలు ఎండబెట్టారు. తొమ్మిది సంవత్సరాలలో రాష్ట్రంలో ఏనాడూ పంటలు ఎండిపోలేదు.కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు అన్ని పథకాలు సమయానికి అందేవి.ప్రజలు ఆలోచన చేయాలి. పరిపాలన దక్షత లేకపోతే ఏం జరుగుతుందో అని.ప్రభుత్వాన్ని నడపడం కాంగ్రెస్ నాయకులకు చేతకావడం లేదు.
ప్రభుత్వంలో చేతకాని ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నారు. వీళ్ళవి మాటలు తప్ప చేతలు లేవు.
ఆగస్టు 15 లోగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా దేవుళ్ళ మీద ఒట్లు పెడుతున్నడు.
మీకు మనసులో నిజంగా ఇచ్చే ఉద్దేశ్యమే ఉంటే దేవుళ్ళ మీద ఓట్లు వేయాల్సిన అవసరం లేదన్నారు.డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ ఇవ్వలేదు.
కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గ్రామగ్రామాన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ళను ఇచ్చారు.రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేయలేదు.పేదలకు పథకాలను అమలు చేసే మగాడు కేసీఆర్ మాత్రమే. మళ్ళీ కేసీఆర్ వస్తేనే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది.బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కలిసిపోయాయి. బిజెపి కి ఓటు వేస్తే కాంగ్రెస్ కు, కాంగ్రెస్ కు ఓటు వేస్తే బిజేపి కి వెళ్ళే పరిస్థితి ఉన్నది.రాష్ట్రంలో టిఆర్ఎస్ బలంగా ఉన్నప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది. అందుకే మనమందరం టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి.

టిఆర్ఎస్ ప్రభుత్వంలో పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ హోదాలో బాన్సువాడ నియోజకవర్గానికి పుష్కలంగా నిధులను తెచ్చి పనులను మంజూరు చేయించారు. అభివృద్ధి పనుల కోసం తెచ్చిన నిధులను ఇక్కడి కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారు పనులను క్యాన్సిల్ చేయిస్తున్నారు. ప్రజలు బాగుపడడం కాంగ్రెస్ నాయకులకు ఇష్టం లేదు.
మన గ్రామాలలో తిరిగి అభివృద్ధి పనులు కొనసాగాలంటే బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి.
బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను పార్లమెంట్ సభ్యులుగా గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది.
పదేళ్ళు పార్లమెంట్ సభ్యులు గా పనిచేసి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్న బిబి పాటిల్ ఏ అభివృద్ధి పనులు చేయలేదు పోచారం భాస్కర్ రెడ్డి విమర్శించారు.గతంలో అయిదేళ్ళు పనిచేసిన కాంగ్రెస్ అభ్యర్ధి సురేష్ షెట్కార్ కూడా ఏం పని చేయలేదు.
పదిహేను సంవత్సరాలు ఏ పని చేయని వాళ్ళకు మనం ఎందుకు ఓటు వెయ్యాలి.
గాలి అనీల్ కుమార్ బిసి బిడ్డ. అందరం కలిసి బలహీన వర్గాల బిడ్డను బారీ మెజారిటీతో గెలిపించాలి. అప్పుడే యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
అందరం కారు గుర్తుపై ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనీల్ కుమార్ ని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలి. ఈ కార్యక్రమంలో నాయకులు అంజిరెడ్డి, నీరజ వెంకటరామిరెడ్డి, మోహన్ నాయక్, ఎర్ర బాలకృష్ణారెడ్డి, గంగుల గంగారం, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular