నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని కోటగిరి మండలం, కొత్తపల్లి సింగిల్ విండో అధ్యక్షులు డాక్టర్ వెనిగళ్ళ సునీల్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో సహకార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వారోత్సవాలను పురస్కరించుకొని ఏడు రంగుల పతాకాన్ని ఎగరవేశారు.ప్రతి సంవత్సరం జూలై మొదటి శనివారం రోజు అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని ఘనంగా సహకార సంఘాలు జరుపుకుంటాయి. శనివారం కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సహకార సంఘం అధ్యక్షులు డాక్టర్ వెనిగళ్ళ సునీల్ కుమార్ చౌదరి డైరెక్టర్ పులిచెర్ల లక్ష్మారెడ్డి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పల దత్తు, లక్ష్మయ్య, సురేష్ నాయక్, సైదయ్య ,గణేష్ సొసైటీ సెక్రటరీ కమలేష్ రైతులు సంఘ సభ్యులు పాల్గొని జాతీయ ఏడు రంగుల పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు డాక్టర్ వెనిగళ్ళ సునీల్ కుమార్ చౌదరి మాట్లాడుతూ సహకార సంఘాలు బలోపేతమైనప్పుడు సభ్యులకు ప్రజలకి చాలా ఉపయోగంగా ఉంటుందని సహకార సంఘాలు బలోపేతం కావాలంటే సభ్యులు చేయూత నివ్వాలి మరియు సంఘంలో డైరెక్టర్లు అధ్యక్షులు అందరూ కృషి చేసి అందరూ కలిసికట్టుగా అభివృద్ధి పథంలో నడపటానికి వివిధ రకాలైనటువంటి వ్యాపార మార్గాలని అన్వేషించి సంఘాల్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటివరకు సభ్యులు, డైరెక్టర్లు అందించిన సహకారంతోనే సంఘాన్ని గాడిలో పెట్టగలిగామని సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క సహకార సభ్యులకి సహకార వారోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
