Tuesday, February 17, 2026

నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా….ఎంపీ గోడం నగేష్

ద్రోణ ఆసిఫాబాద్

కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణం వడ్డేపల్లి గార్డెన్ లో అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జడ్పిటిసి అరిగెల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సన్మాన సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ గోడం నాగేష్ పాల్గొన్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ కొమురం భీం జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ కి అరిగేలా నాగేశ్వరరావు కి కొట్నాక్ విజయ్ కి నాయకులకు కార్యకర్తలకు ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలకు విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఆసిఫాబాద్ నియోజవర్గం లోని సమస్యలపై అవగాహన ఉందని ఖచ్చితంగా ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతానని హామీ ఇచ్చారు,


కాంగ్రెస్ మాయమాటలతోటి అధికారంలో వచ్చి జూటా హామీలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూన్నారని తెలంగాణ ప్రజలు ఈ హామీలను నమ్మబోరని రానున్న స్థానిక ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


అదేవిధంగా రానున్న స్థానిక ఎన్నికల్లో నాయకులు కార్యకర్తలు బిజేపి విజయం సాధించే దిశగా పాటుపడాలని స్థానిక ఎన్నికల్లో విజయం సాధించినప్పుడే పూర్తిస్థాయి విజయం సాధించిన వాళ్ళం అవుతామని కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా పదాధికారులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular