ద్రోణ రాజన్న జిల్లా:జులై 15
రాజన్న సిరిసిల్ల జిల్లా వేము లవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో ఆదివారం సాయంత్రం కైరా శేఖర్ అనే యువకుడు ట్రాక్టర్ సహాయంతో పొలాన్ని దున్నుతూ ప్రమాదవ శాత్తు వ్యవసాయ బావిలో ట్రాక్టర్ తో సహా పడి పోయాడు. గాలింపు చర్యల్లో మృత దేహం కోసం ఆదివారం శ్రమించిన పోలీసులు వీలు కాకపోవడంతో,సోమవారం ఉదయం క్రేన్ సహాయంతో శేఖర్ మృతదేహాన్ని బయటకు తీశారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శేఖర్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
