15 రోజుల్లో పనుల ప్రారంభం
రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
షాద్ నగర్ లో మంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
రూ. 5వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి కృషి
చటాన్ పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి తోపాటు త్వరలోనే ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిర్మాణం
ద్రోణ రంగారెడ్డి ప్రతినిధి
190 కోట్లతో చటాన్ పల్లి ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణం పనులు 15 రోజుల్లో ప్రారంభం
చేస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని
44వ జాతీయ రహదారి వద్ద
స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్వాగతం పలికారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..
190 కోట్ల రూపాయలతో చటాన్ పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి పూర్తిస్థాయి నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సూచించారు. గతంలో 90 కోట్లతో నిర్మాణ వ్యయం చేసేందుకు సిద్ధం చేశారని కానీ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చొరవతో భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి 190 కోట్ల రూపాయలను మంజూరు చేసి మరో 15 రోజుల్లో పూర్తిస్థాయిలో పనులు చేపడుతామని వైద్య జంక్షన్ తరహాలో రైల్వే ఓట్ బ్రిడ్జి నిర్మాణం చేపడతామని తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్ నుండి కర్నూల్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం ఐదు వేల కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించబడ్డాయని సంబంధిత కేంద్ర మంత్రి నితిన్ గడుకరితో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడానని తెలిపారు. ఈ రోడ్డు రావడంతో రవాణా మార్గం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలు మొదలు పెట్టారనీ మంత్రులు కూడా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించడం జరుగుతుందని పేర్కొన్నారు. డీఎస్సీ ఉద్యోగాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే ఇస్తారని టిఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మితే ఏమి ప్రయోజనం లేదని తెలిపారు. గత పదిహేను ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన చేసింది వాళ్లేనని వాళ్ల మాటలు నమ్మకూడదని హితవు పలికారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టడం గొప్ప విషయమని కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిర్మాణాన్ని కూడా శంకుస్థాపనను చేపడతామని తెలిపారు. నియోజకవర్గాన్ని సర్వతో ముఖాభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర శాఖల మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
