Tuesday, February 17, 2026

తల్లి కూతుళ్లను పొట్టన పెట్టుకున్న లారీ

ద్రోణ తిరుపతి జిల్లా:జులై 15

తల్లీబిడ్డ ప్రాణాలను బలి గొన్న విషాద ఘటన తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం ఆమడూరులో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పుట్టింటికి వచ్చి తిరిగి వెళుతున్న మహిళతో పాటు ఆమె కూతురిని లారీ పొట్ట నపెట్టుకుంది. మృతురాలి నాలుగేళ్ల కుమారుడు తీవ్ర గాయాలతో చావుబతుకు ల్లో ఉన్నాడు. మృతురాలి తల్లికి స్వల్పగాయాల య్యాయి.
ఆమడూరు క్రాస్ రోడ్డు వద్ద ఆటో కోసం వేచిచూస్తున్న నలుగురిపైకి లారీ దూసు కెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో తల్లీ శారద (22), కూతురు వైష్ణవి (2) మృతి చెందారు. శారద కొడుకు కార్తీక్(4) తీవ్రంగా గాయపడ్డాడు. శారద తల్లి విజయమ్మకు స్వల్పగాయాలతో బయటపడింది. వీరిద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. శారద రెండ్రోజుల క్రితం రేణిగుంట మండలం మల్లవరంలోని పుట్టింటికి వచ్చి, తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏర్పేడు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్ ను అదుపులో తీసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోవడంతో శారద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular