Monday, May 18, 2026

భార్య పిల్లలను చంపిన ఘనుడు

ద్రోణ ఖమ్మం

అక్రమ సంబంధం పెట్టుకొని భార్య, పిల్లలను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భర్త 48 రోజుల తర్వాత కొలిక్కి వచ్చిన కేసు ఖమ్మం – రఘునాథపాలెం మండలం బాబోజీ తండకు చెందిన ప్రవీణ్ హైదరాబాద్లో ఒక ఆస్పత్రిలో పిజియోతెరపిస్టుగా పని చేస్తూ అదే ఆస్పత్రిలో పని చేస్తున్న సోని ప్రాన్సిస్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
సోని ప్రాన్సిస్ తో కలిసి ఉండాలని తన భార్య, ఇద్దరు పిల్లల అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. కారులో గ్రామానికి వెళ్తుండగా, పోస్టుమార్టంలో ఎంత మోతాదులో పాయిజన్ డోస్ ఇస్తే రాదో గూగుల్ లో వెతికి తెలుసుకొని తన భార్యకు కారులో మత్తుమందు సూది ఇచ్చి, 4 ఏళ్ల లోపున్న ఇద్దరు ఆడ పిల్లల గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి ముగ్గురిని చంపేశాడు.
ఆ తర్వాత కారును ఒక చెట్టుకు గుద్ది రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు చిత్రీకరించాడు చనిపోయిన భార్య, పిల్లల ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానంతో భార్య కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనిపై విచారణ జరిపిన పోలీసులు కారులో ఒక ఇంజక్షన్, ప్రవీణ్ ఫోన్లో గూగుల్ హిస్టరీతో ప్రశ్నించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular